నిరుద్యోగ భారతం!... ఉద్యోగాల కోసం ముంబైలో తొక్కిసలాట!

ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జాబ్ నోటిఫికేషన్ వెలువడింది.

Update: 2024-07-17 08:00 GMT

భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందనేది తెలిసిన విషయమే. రోజు రోజుకీ భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. కనీస వేతనం దొరికే ఉద్యోగాలు దొరకడం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నట్లు చెబుతున్న భారత్ లో తివిరి ఇసుమన తైలం తీసినంత కష్టం అవుతుందని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులకు కనీస అర్హతలు ఎస్.ఎస్.సీ / టెన్త్ పాస్. గరిష్ట వయసు 23 ఏళ్లు. దీంతో... వేలాది మంది పోటెత్తారు. కిలో మీటర్ల మేర క్యూలైన్ ఏర్పడింది. ఈ సమయంలో దరఖాస్తుదారులను కంట్రోల్ చేయడం నిర్వాహకులకు తలకు మించిన భారం అవ్వడంతో పోలీసుల సహాయం కోరారు.

అవును... ముంబైలోని కలీనాలో ఎయిరిండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ సమయంలో వందల సంఖ్యలో ఉన్న ఉద్యోగాల కోసం ఊహించని స్థాయిలో ఉద్యోగార్థులు రావడంతో గందరగోళ పరిస్థితులు కనిపించాయి. హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ పోస్టుల కోసం 1,800 ఖాళీలు ఉండగా.. సుమారు 15,000 మంది హాజరయ్యారని అంటున్నారు.

ఈ జాబ్స్ కి పరిమిత ఖాళీలు ఉన్నప్పటికీ.. రిక్రూట్మెంట్ ఆఫీస్ బయట భారీ సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట వంటి పరిస్థితి ఎదురైంది. దీంతో దరఖాస్తు దారులు తమ రెజ్యూం లను డిపాజిట్ చేసి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని కోరారు నిర్వాహకులు. దీనిపై ఏవియేషన్ ఇండస్ట్రీ ఎంపాయిస్ గిల్డ్ జనరల్ సెక్రటరీ జార్జ్ అబ్రమ్ మాట్లాడారు! ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... తనకున్న సమాచారం ప్రకారం సుమారు 50,000 మంది వ్యక్తులు వచ్చారని జార్జ్ అబ్రమ్ చెబుతున్నారు. ఇలాంటి డ్రైవ్ లకు వ్యతిరేకంగా కంపెనీని హెచ్చరించినట్లు తెలిపారు. 1786 హ్యాండీమ్యాన్, 16 యుటిలిటీ ఏజెంట్ పోస్టులు ఉన్నాయని.. వీటి కోసం 1 కి.మీ. మేర క్యూ నెలకొందని.. పోలీసులను పిలవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇదే సమయంలో దేశంలో నిరుద్యోగ పరిస్థితికి ఇది తాజా ఉదాహరణ అని అంటున్నారు.

ఇక ఈ పోస్టులకు కనీస విద్యార్హతలు ఎస్.ఎస్.సీ / టెన్త్ పాస్ కాగా గరిష్ట వయసు 23 ఏళ్లు. ఈ ఉద్యోగాలకు జీతం నెలకు రూ.22,530 గా నిర్ణయించబడింది. ఇవి 3 ఏళ్ల కాంట్రాక్ట్ ఉద్యోగాలు. ఇక ఎయిరిండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ అధికారులు మాత్రం... 15,000 మంది దరఖాస్తులు సమర్పించడానికి వచ్చారని అంటున్నారు.

Full View
Tags:    

Similar News