ఫ్రపంచాన్ని ట్రంప్ టెన్షన్ పెడుతుంటే.. ట్రంప్ ను గుడ్డు టెన్షన్ పెడుతుందట!

ప్రపంచ దేశాలను, అమెరికాలో ఉన్న వలసదారులను డొనాల్డ్ ట్రంప్ టెన్షన్ పెడుతుంటే.. ఆయనను మాత్రం కోడి గుడ్డు టెన్షన్ పెడుతుందని అంటున్నారు

Update: 2025-01-27 03:50 GMT

ప్రపంచ దేశాలను, అమెరికాలో ఉన్న వలసదారులను డొనాల్డ్ ట్రంప్ టెన్షన్ పెడుతుంటే.. ఆయనను మాత్రం కోడి గుడ్డు టెన్షన్ పెడుతుందని అంటున్నారు. గత కొన్ని రోజులుగా అగ్రారాజ్యంలో కోడి గుడ్డు ధరలు ఆకాశాన్నంటుతున్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా డజను గుడ్లు ఏడు యూఎస్ డాలర్లు (రూ.603)కు అమ్ముతున్నట్లు చెబుతున్నారు.

అవును... అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. ఇందులో భాగంగా... గత ఏడాది అధ్యక్ష ఎన్నికల ప్రచారం గుడ్ల ధర కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా... అప్పటి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ హయాంలో గుడ్లు 5 డాలర్లు అని ప్రస్తుత ప్రెసిడెంట్ పేర్కొన్నారు. తానొస్తే కంట్రోల్ చేస్తానన్నారు!

మరోపక్క పెన్సిల్వేనియాలో కిరాణా దుకాణంలో డజను గుడ్లు 2.99 డాలర్లకు విక్రయించే డిస్ ప్లే ముందే నిలబడి గుడ్ల ధర 4 డాలర్లు అంటూ జేడీ వాన్స్ ప్రచారం చేశారని.. చెబుతున్న డెమోక్రాట్లు.. ప్రస్తుతం అమెరికాలో కోడి గుడ్ల ధరలు విపరీతంగా పెరగడానికి డొనాల్డ్ ట్రంప్ కారణమని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా తేడా చెబుతున్నారు.

ఇందులో భాగంగా.. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం డిసెంబర్ లో డజన్ ఏ-గ్రేడ్ గుడ్ల ధర 4.15 డాలర్లుగా ఉంటే.. అది నవంబర్ లో 3.65 డాలర్లుగానే ఉంది. అయితే... ఈ ఏడాది ప్రస్తుత ధర సుమారు 7 డాలర్లు అని డెమోక్రాట్లూ లెక్కలు చూపెడుతూ ట్రంప్ కు చుక్కలు చూపెట్టే స్థాయిలో విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.

వాస్తవానికి అమెరికన్స్ అల్పాహారంలో గుడ్డు ఒక భాగమని చెబుతున్నారు. దీంతో.. ప్రతీ రోజు కోట్లాది మంది కోడి గుడ్లు కొనుగోలు చేస్తారని అంటున్నారు. అయితే... ట్రంప్ వచ్చిన తర్వాత గుడ్ల విషయంలో తమ దుడ్డు లెక్క మించిపోతోందని వారు బెంబేలెత్తుతున్నరంట. ఈ సందర్భంగా.. బైడెన్ పదవీకాలంతో పోలిస్తే ఇప్పుడు గుడ్ల ధర 40శాతం పెరిగినట్లు ఆరోపణ.

ఈ సందర్భంగా స్పందించిన మెన్నెసోట సెనేటర్ అమీ క్లోబుచార్... ట్రంప్ ప్రసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో గుడ్ల ధరలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారని.. అయితే, అటువంటిదేమీ జరగడం లేదని.. ఫలితంగా.. దేశ ప్రజల ఆరోగ్యానికి, జేబుకు ముప్పు వాటిల్లుతోందని ఆరోపించారు.

Tags:    

Similar News