ఆ సైకో గురించి యూఎస్ సంస్థ సమాచారం.. పట్టేసిన మన ఖాకీలు
ముక్కుపచ్చలారని చిన్నారుల్ని సెక్సు కోణంలో చూడటానికి మించిన శాడిజం ఇంకేం ఉంటుంది.
ముక్కుపచ్చలారని చిన్నారుల్ని సె*క్సు కోణంలో చూడటానికి మించిన శాడిజం ఇంకేం ఉంటుంది. ఇలాంటి ఛండాలాలకు పాల్పడే సైకోగాళ్ల మీద ప్రపంచ వ్యాప్తంగా నిఘా ఉంటుంది. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉండే ఈ పాడు పనుల వీడియోలను చూసే వారిని.. ఇలాంటి వాటిని వ్యాప్తి చేసే వారిపై చర్యల కోసం పెద్ద నెట్ వర్కు పని చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక సైకోగాడి గురించి అమెరికా సంస్థ నుంచి హైదరాబాద్ పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే స్పందించిన వారు రంగంలోకి దిగి బెంగళూరుకు వెళ్లి మరీ పట్టుకున్న ఆ సైతాను ఉదంతమిది.
సోషల్ మీడియాలో చిన్నారుల అశ్లీల వీడియోలు.. మనిషి అన్నోడు చేయలేని పనులకు సంబంధించిన వీడియోలను జంషెడ్ అనే వ్యక్తి వ్యాప్తి చేస్తున్నాడన్న విషయాన్ని అమెరికాలోని ‘‘జాతీయ అదృశ్య, పీడిత బాలల కేంద్రం’’ గుర్తించింది. ఎన్ సీఎంఈసీ అనే పొట్టిపేరుతో వ్యవహరించే ఈ సంస్థ.. ఆన్ లైన్ కేంద్రంగా చిన్నారులకు సంబంధించిన దారుణ వీడియోల్ని ప్రొడ్యూస్ చేసే వారు.. వ్యాప్తి చేసే వారిని గుర్తించే పనిలో ఉంటుంది. ఆ క్రమంలో జంషెడ్ గురించిన సమాచారాన్ని గుర్తించింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇతను బెంగళూరులో ఉంటాడు.
అమెరికా సంస్థ నుంచి సమాచారం అందుకున్న హైదరాబాద్ మహానగర పోలీసులు వెంటనే స్పందించారు. నిందితుడి వివరాల్ని సేకరించి.. బెంగళూరుకు వెళ్లిన ప్రత్యేక టీం అతడ్ని అరెస్టు చేశారు. ఫేస్ బుక్.. ఇతర సోషల్ మీడియా మాథ్యమాల ద్వారా చిన్నారుల అశ్లీల వీడియోలను షేర్ చేస్తుంటాడు. ఈ విషయాన్ని అమెరికా సంస్థ గుర్తించి దానిని జాతీయ నేర గణాంక సంస్థకు సమాచారాన్ని ఇచ్చింది. వారు హైదరాబాద్ పోలీసులకు చెప్పగా.. రంగంలోకి దిగిన మన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా సంస్థకు జాతీయ నేర గణాంక సంస్థకు మధ్య కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా ఈ సైకోను గుర్తించటం తేలికైంది. సో.. పాడు పనులకు హద్దులు ఉంటాయని గుర్తించని వారికి జైలు తప్పదు. బీకేర్ ఫుల్.