ట్రంప్‌ పైకి కాల్పులు... యూ.ఎస్.ఎస్.ఎస్. సంచలన విషయాలు!

వివరాళ్లోకి వెళ్తే... ట్రంప్ పై కాల్పులకు తెగబడ్డ నిందితుడు థామస్ మథ్యూ క్రూక్స్ ఏ ఇంటి పైకప్పు మీదకు పాక్కుంటూ వెళ్లాడొ... అదే ఇంట్లో స్నిప్పర్ బృందం పొజిషన్ తీసుకొని ఉందంట.

Update: 2024-07-16 13:28 GMT

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ అంశంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటనలో యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ (యూ.ఎస్.ఎస్.ఎస్.) కీలక విషయాలు వెల్లడించింది. ఈ నేపథ్యంలో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

అవును... అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ రక్షణ విషయంలో యూఎస్ ఏజెన్సీల వైఫల్యానికి సంబంధించిన అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... తాజాగా మరో షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఈ ఘటన సమయంలో స్నిప్పర్ బృంధం పొజిషన్ తీసుకొని ఉన్న ఇంటిపైకప్పు మీదకే పాక్కుంటూ వెళ్లాడట.

వివరాళ్లోకి వెళ్తే... ట్రంప్ పై కాల్పులకు తెగబడ్డ నిందితుడు థామస్ మథ్యూ క్రూక్స్ ఏ ఇంటి పైకప్పు మీదకు పాక్కుంటూ వెళ్లాడొ... అదే ఇంట్లో స్నిప్పర్ బృందం పొజిషన్ తీసుకొని ఉందంట. ఆ బృందం రెండో ఫ్లోర్ లోకి కిటికీ నుంచి తుపాకులు ఎక్కుపెట్టి అభిమానులను గమనిస్తోంది.

అంటే ఆ స్నిప్పర్ బృందం పైనే నక్కి ఉన్న మాథ్యూ క్రూక్స్.. గురి చూసి ట్రంప్ పైకి కాల్పులు జరిపాడు. అప్పుడు కాని వారిపైన ఓ మనిషి ఉన్నాడని, తమకు పూర్తి భిన్నమైన పని చేయడానికి తమపైన నక్కాడని వారికి తెలియలేదు. ఈ విషయాన్నే తాజాగా యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ (యూ.ఎస్.ఎస్.ఎస్.) వెల్లడించింది.

ఇక ట్రంప్ పై కాల్పులు జరిపిన మాథ్యూ క్రూక్స్ తండ్రి పేరిట ఏకంగా 20కి పైగా తుపాకులు రిజిస్టరై ఉన్నట్లు చెబుతున్నారు. అయితే వాటన్నింటినీ లైసెస్నులతోనే కొనుగోలు చేశాడట. ఇక మాథ్యూ క్రూక్ మృతదేహాన్ని పరిశీలించగా.. ఒక ట్రాన్స్ మీటర్ దొరికింది. దాన్ని ఆతడి తండ్రి 2013లోనే కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.

మరోపక్క ఇప్పటికే క్రూక్స్ ఫోన్ ను ఎఫ్.బి.ఐ సక్సెస్ ఫుల్ గా యాక్సిస్ చేయగలిగింది. అయితే దానిలో విచారణ ముందుకు కదలడానికి ఉపయోగపడే సమాచారం ఏదీ లభించలేదు. ఇదే సమయంలో... క్రూక్స్ కు ఎవరో ఎక్స్ పర్ట్ కచ్చితంగా సాయం చేసి ఉంటారని కెనడాకు చెందిన ఎక్స్ పర్ట్ డల్లాస్ అలెగ్జాండర్ వెల్లడించారు.

Tags:    

Similar News