ఫస్ట్ నైట్ వాడి ఆటవిక పనికి పెళ్లికుమార్తె చనిపోయింది
గ్యాంగ్ రేప్ చేసినంత దారుణంగా బాధితురాలిపై అత్యాచారం జరిగిందని వైద్యులు చెబుతున్నారు. పెళ్లైన ఆ వధువుకు తల్లిదండ్రులు లేరు
విన్నంతనే అయ్యో అనిపించే ఉదంతమిది. కొత్తగా పెళ్లై.. తొలిరాత్రి అన్నంతనే బెరుకు.. భయంతో పాటు పలు సందేహాలు.. టెన్షన్లలో ఉన్న వేళ.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడేలా వ్యవహరించాలే తప్పించి.. విపరీతమైన కామంతో మొరటుగా వ్యవహరించిన ఒక మగాడి కారణంగా నవవధువు ప్రాణాలు కోల్పోయిన షాకింగ్ పరిణామం ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. అవగాహన లేకపోవటం.. బాధ్యతగా వ్యవహరించాలన్న మైండ్ సెట్ కు బదులుగా ఆటవికంగా వ్యవహరించిన తీరుకు పెళ్లి కుమార్తె ప్రాణాలు విడిచింది.
తొలిరాత్రే ఆటవికంగా చేసిన శృంగారానికి ఒక అమ్మాయి బలైంది. ఉత్తరప్రదేశ్ లోని హమీర్ పూర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. శోభనం రోజున కామాన్ని పెంచే మాత్రల్ని వేసుకున్న పెళ్లి కొడుకు.. బాధితురాలిపై రాక్షసంగా ప్రవర్తించాడు. దీంతో.. ఆమె తీవ్రమైన హింసను అనుభవించింది. ఆమె జననాంగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో..ఇన్ఫెక్షన్ కావటంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె తాజాగా మరణించింది.
గ్యాంగ్ రేప్ చేసినంత దారుణంగా బాధితురాలిపై అత్యాచారం జరిగిందని వైద్యులు చెబుతున్నారు. పెళ్లైన ఆ వధువుకు తల్లిదండ్రులు లేరు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమె సోదరుడు.. ఫిబ్రవరి 3న ఆమె పెళ్లిని ఘనంగా నిర్వహించారు నాలుగో తేదీన అత్తారింటికి పంపారు. శోభనం రోజు రాత్రి కామాన్ని పెంచే మాత్రలు వేసుకోని అత్యంత అనాగరికంగా వ్యవహరించిన కొత్త పెళ్లి కొడుకు హింసకు ఆమె తాళలేకపోయింది. తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఏడో తారీఖు చేరిన ఆమె పదో తేదీన ప్రాణాలు విడిచింది. దీంతో నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలి తరఫు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆ మొరటోడు ఇంటికి తాళం వేసుకొని పరారయ్యాడు. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.