ఉన్మాద ప్రేమ... మత్తుమందు ఇచ్చి లింగ మార్పిడి ఆపరేషన్!
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని ముజఫుర్ నగర్ కు చెందిన ఒక యువకుడు(20)కి ఓం ప్రకాశ్ అనే వ్యక్తి సుమారు రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు.
ప్రేమించిన వారిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనలతో రకరకాల పనులకు పాల్పడే వ్యవహారాలకు సంబంధించిన విషయాలు తరచూ వింటూనే ఉంటాం. అయితే... తాజా ఒక వ్యక్తి మాత్రం "అంతకు మించి" ఆలోచించాడు. తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం లింగ మార్పిడి ఆపరేషన్ చేయించేశాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.
అవును... తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా అతడికి లింగ మార్పిడి ఆపరేషన్ చేయించాడు. అది కూడా అతడికి ఏమాత్రం తెలియకుండా మత్తుమందు ఇప్పించి మరీ అమ్మాయిగా మార్చేశాడు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం వైరల్ గా మారింది. అసలు ఈ ఘటన ఎన్నిక జరిగింది.. ఎలా జరిగింది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం...!
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని ముజఫుర్ నగర్ కు చెందిన ఒక యువకుడు(20)కి ఓం ప్రకాశ్ అనే వ్యక్తి సుమారు రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఆ యువకుడు అనారోగ్యానికి గురవ్వడంతో చెకప్ చెయిస్తానంటూ ఓం ప్రకాశ్ ఈ నెల 3న మున్సూర్ పుర్ లోని బేగ్ రాజ్ పుర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
దీంతో... ఆ యువకుడిని పరీక్షించిన వైద్యులు చిన్న సర్జరీ చేయాలని సూచించారు. అనంతరం అతడికి మత్తుమందు ఇచ్చి.. లింగ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అంటే వైద్యులతో కలిసి ఓం ప్రకాశ్ ఈ వ్యవహారం అంతా నడిపినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన బాధిత యువకుడు తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
ఇందులో భాగంగా... ఆస్పత్రికి తీసుకొచ్చిన మరుసటి రోజే తనకు ఆపరేషన్ చేశారని.. స్పృహలోకి రాగానే అమ్మాయిగా మారిపోయాననే విషయం చెప్పారని.. తానే ఇదంతా చేయించినట్లు ఓం ప్రకాశ్ చెప్పాడని.. ఇక తాను జీవితాంతం తనతోనే ఉండొచ్చని చెప్పాడని.. పెళ్లికి కూడా ఏర్పాట్లు చేసినట్లు చెప్పాడని.. బాధిత యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదే సమయంలో... తనతో పెళ్లికి అంగీకరించకపోతే నా తండ్రిని చంపేస్తానని బెదిరించాడని.. మా భూమిని కూడా లాక్కొన్నాడని తెలిపాడు. అయినప్పటికీ ఏదోలా ధైర్యం చేసి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో బాధితుడి తండ్రి ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. దీంతో పోలీసులు ఓం ప్రకాశ్ ను అరెస్ట్ చేశారు.