కృష్ణా జిల్లాలో ఆ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యేకు ఈ సారి ఎదురుగాలే...!

ఇదే ప‌రిస్థితి ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఎదుర్కొంటున్నార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

Update: 2023-08-10 06:18 GMT

రాజ‌కీయాలంటే.. రాజ‌కీయాలే. ఎప్పుడూ ఒకే ర‌కంగా ఉండే ప‌రిస్థితి లేదు. ఇప్పుడున్న రాజ‌కీలు రేపు ఇలానే ఉంటాయ‌ని లేదు. ఇదే ప‌రిస్థితి ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఎదుర్కొంటున్నార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. గ‌త 2014, 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న ప‌రిస్థితి న‌ల్లేరుపై న‌డ‌క‌గా మారిపోయింది. దీనికి కార‌ణం.. బ‌ల‌మైన టీడీపీకేడ‌ర్ అంతా కూడా ఆయ‌న వెంటే ఉంది. ప్ర‌జ‌లు కూడా ఆయ‌న‌ను న‌మ్మారు.

స్థానికంగా కూడా టీడీపీని వంశీ డెవ‌ల‌ప్ చేశారు. కేడ‌ర్‌ను పెంచుకున్నారు. యువ‌త‌లో భ‌రోసా నింపారు. దీంతో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఆయ‌న అస‌లు ఎన్నిక‌ల‌ను పెద్ద సీరి య‌స్ గా కూడా తీసుకోలేదు.

అంతేకాదు.. పార్టీలోనూ ఆయ‌నంటే.. ఎంతో ఇమేజ్ ఉండేది. తిరుగులేని నాయ‌కుడిగా ఆయ‌న ఒక ఊపు ఊగారు. అయితే.. ఆయ‌న కోరి కోరి 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకు న్నాక వైసీపీ పంచ‌న చేరిపోయారు.

వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు ఇది ఆనందాన్ని ఇచ్చి ఉండొచ్చు. కానీ.. రాజకీయంగా మాత్రం వంశీకి ఇది పూర్తి మైన‌స్ అయిపోయింద‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది. త‌ట‌స్థులు కూడా వంశీని న‌మ్మే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని.. అనేక ఆన్‌లైన్ చానెళ్లు చేస్తున్న స‌ర్వేల్లో తేలి పోయింది. వంశీ అంటే ఎంతో గౌర‌వం ఉంద‌ని అంటున్న వారు కూడా.. ఎన్నిక‌ల విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం ఇప్పుడే ఏం చెప్ప‌లేం.. అని అనేస్తున్నారు.

నిజానికి ఇలాంటి ప‌రిస్థితి వంశీకి ఎప్పుడూ ఎదురు కాలేదు. ఆయ‌నే మా ఎమ్మెల్యే అని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పిన ప‌రిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. పైగా.. ఆయ‌న ఉన్న వైసీపీలోనూ.. ఆయ‌న‌కు ఎదురు గాలి వీస్తోంది. గ‌తంలో ఆయ‌న టీడీపీలో ఉంటే.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

కానీ.. ఇప్పుడు వైసీపీలో ఆయ‌న‌కు అంతా వ్య‌తిరేకంగానే క‌నిపిస్తోంది. ఒక్క అధిష్టానం మాత్ర‌మే ఆయ‌న‌కు అనుకూలంగా ఉండ‌గా.. క్షేత్ర‌స్థాయిలో డెబ్బై శాతం వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న చెమ‌ట చిందించాల్సిందే అనే టాక్ స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News