వల్లభనేని ప్రధాన అనుచరుడు అరెస్ట్... తెరపైకి కొత్త కేసు?

గత ప్రభుత్వ హయాంలో ప్రధానంగా గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పై టీడీపీ నుంచి పలు ఫిర్యాదులు అందేవన్న సంగతి తెలిసిందే.

Update: 2024-11-02 10:05 GMT

గత ప్రభుత్వ హయాంలో ప్రధానంగా గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పై టీడీపీ నుంచి పలు ఫిర్యాదులు అందేవన్న సంగతి తెలిసిందే. ఆ రెండు నియోజకవర్గాల్లోనూ వీరి వ్యవహారాలు తీవ్రంగా ఉండేవని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కాదనే ఆరోపణలూ ఉన్నాయి!

అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత లెక్కలు పూర్తిగా మారాయని.. ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్ గా వాతావరణంలో మార్పులు వచ్చాయని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడుపై అరెస్ట్ వారెంట్ ఇప్పటికే జారీ అయిన నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు.

అవును... వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు యతేంద్ర రామకృష్ణ, అలియాస్ రాముని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది! కోర్టు అతడిపై అరెస్ట్ వారీ జారీ చేయడంతో అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

అయితే.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాది కేసులోనే రామును అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. స్థానిక సోషల్ మీడియాల్లోనూ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గ్రూపుల్లోనూ ఇదే ప్రచారం జరుగుతోందని అంటున్నారు. అయితే... ఇది ఆ కేసు కాదని, వేరే కేసు అని అంటున్నారు!

ఇందులో భాగంగా... యతేంద్ర రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసింది టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించిన కేసులో కాదని.. విడాకుల కేసులో అని.. అతని భార్య అతని నుంచి మెయింటెనెన్స్ నిధులు డిమాండ్ చేయడం, కోర్టు ఆమేరకు ఆదేశాలు జారీ చేయడం.. అతడు దానిని ఉల్లంఘించడం వల్ల అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందనే మరో ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది!

దీనికి సంబంధించిన నిజానిజాలు, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది!

Tags:    

Similar News