వరలక్షికి ఆ భామ గట్టిపోటీనే!
వరలక్ష్మి శతర్ కుమార్ నటిగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతోన్న సంగతి తెలిసిందే. విలనీ పాత్రల్లో తనదైన మార్క్ తో దూసుకుపోతుంది
వరలక్ష్మి శతర్ కుమార్ నటిగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతోన్న సంగతి తెలిసిందే. విలనీ పాత్రల్లో తనదైన మార్క్ తో దూసుకుపోతుంది. కోలీవుడ్ లో ఇప్పటికే సక్సెస్ అయింది. టాలీవుడ్ లోనూ ఆ రకమైన ఛాన్సు లు అందుకుంటుంది. ఇంకా సరైన బలమైన పాత్ర పడలేదు. పడితే వరలక్ష్మి సత్తా చాటుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇదే సమయంలో ఇతర చిత్రాల్లో మెయిన్ లీడ్స్ సైతం పోషిస్తుంది. నటిగా మంచి భవిష్యత్ ఉందని సీనియర్ స్టార్లతో నీరాజనాలు అందుకుంటుంది.
మరి వరలక్ష్మి స్పీడ్ కి శ్రియారెడ్డి బ్రేక్ వేసే అవకాశం ఉందా? వరలక్ష్మి కి సరైన రీప్లేస్ మెంట్ గా శ్రియారెడ్డిని భావించొచ్చా? అంటే అవుననే అనాలేమో. సలార్ సీజ్ పైర్ తో శ్రియారెడ్డి నాలుగేళ్ల తర్వాత కంబ్యాక్ అయిన సంగతి తె లిసిందే. ఇందులో శ్రియా రాధారమ మన్నార్ పాత్రలో అదరగొట్టేసింది. రెండవ భాగంలో ఆ పాత్ర ఇంకెంత బలంగా ఉంటుందన్నది తెలుస్తుంది. ఇక ఆమెలో ప్రతిభ గురించి ఇప్పుడు చెప్పాల్సిన పనిలేదు.
ఆమె గ్రేట్ యాక్టెరస్ అని కెరీర్ ఆరంభంలోనే నిరూపించుకున్నారు. తమిళ్..మలయాళంలో కొన్ని సినిమాలు చేసారు. ముఖ్యంగా లేడీ విలనీగా ఆమె బ్రాండ్ ఉంది. 'పొగరు' సినిమాలో పొగరబోతు విలనీ పాత్ర లో ఏ రేంజ్ లో పెర్పార్మెన్స్ ఇచ్చిందో చెప్పాల్సిన పనిలేద. తెలుగులో ఆసినిమాతో బాగా ఫేమస్ అయింది. లేడీ విలన్ అంటే ఇలా ఉండాలని చూపించింది. అయితే ఆ తర్వాత ఆమె ఒక్కసారిగా సినిమాలకు దూరమయ్యారు.
వివాహం తర్వాత ఆమెరికాలో స్థిరపడటంతో మళ్లీ మ్యాకప్ వేసుకోలేదు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సలార్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అగ్ర హీరోల సినిమాల్లో శ్రియా రెడ్డి ఛాన్సులు అందుకుంటుంది. 'ఓజీ'లో కూడా నటిస్తోంది. అయితే ఒకవేళ శ్రియా రెడ్డి గనుక కంబ్యాక్ అవ్వకపోయి ఉంటే? ఆ పాత్రల్లో నటించే ఛాన్స్ వరలక్ష్మికి దక్కేదని కోలీవుడ్ వర్గాల్లో చర్చకొస్తుంది. శ్రీయారెడ్డి రావడంతోనే వరలక్ష్మికి అవకాశాలు తగ్గుతున్నాయని అంచనా వేస్తున్నారు.