నెల్లూరు పాలిటిక్స్ : వేమిరెడ్డి కోసం నారాయణ పెద్ద త్యాగం...!

వైసీపీ ద్వారా ఎంపీ అయి ఆ విధంగా రాజకీయాలకు పరిచయం అయిన వారు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి

Update: 2024-02-22 13:49 GMT

వైసీపీ ద్వారా ఎంపీ అయి ఆ విధంగా రాజకీయాలకు పరిచయం అయిన వారు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి. ఆయన ఆరేళ్ల పాటు పెద్దల సభలో సభ్యునిగా ఉన్నారు. ఇక ఆయనను నెల్లూరు నుంచి ఈసారి లోక్ సభకు పోటీ చేయించాలని అధినాయకత్వం నిర్ణయించింది. అయితే తన సతీమణి ప్రశాంతి రెడ్డికి నెల్లూరు సిటీ టికెట్ కావాలని వేమిరెడ్డి కోరుకున్నారు. దాన్ని హై కమాండ్ కాదనడంతో ఆయన విధేయతను మార్చేశారు.

ఆయన అడుగులు వడివడిగా టీడీపీ వైపుగా పడ్డాయి. నెల్లూరు వైసీపీకి కంచుకోట. అలాంటి చోట ఆ పార్టీలో నుంచి సిట్టింగ్ ఎంపీ అంగబలం అర్ధబలం దండీగా కలిగిన వేమిరెడ్డి టీడీపీ వైపు వస్తున్నారు అంటే రెడ్ కార్పెట్ పరచింది టీడీపీ అధినాయకత్వం. అలా నెల్లూరు ఎంపీ సీటుకు టీడీపీ తరఫున వేమిరెడ్డి పోటీ చేయడం ఖాయం అయిపోయింది.

అయితే వేమిరెడ్డి సతీమణికి నెల్లూరు సిటీ టికెట్ కోరారు. అక్కడే వచ్చింది సమస్య. ఆ సీటుకు మాజీ మంత్రి నారాయణ గట్టి అభ్యర్ధిగా ఉన్నారు. 2014 నుంచి 2019లలో వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో నారాయణ కీలక మంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు.

ప్రత్యక్ష రాజకీయాల్లో నెగ్గి అసెంబ్లీలో అడుగుపెట్టాలని నారాయణ కోరిక. అది జగన్ ప్రభంజనం లో 2009లో తీరలేదు. ఈసారి అయినా కచ్చితంగా గెలిచి తీరుతాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్న దశలో వేమిరెడ్డి సడెన్ ఎంట్రీ ఇచ్చారు. దాంతో నారాయణకు ఇక్కడ అగ్ని పరీక్ష అయింది.

ఈ ఇద్దరినీ మాట్లాడుకోమని టీడీపీ అధినాయకత్వం చెప్పడంతో నారాయణ వేమిరెడ్డి కలసి వేసిన సింగిల్ సిటింగ్ లోనే ఈ హార్డ్ ఇష్యూ కాస్తా వెరీ స్మూత్ గా సెట్ అయిపోయింది అని అంటున్నారు. వేమిరెడ్డి సతీమణి కోసం తాను నెల్లూరు అసెంబ్లీ సీటుని త్యాగం చేసేందుకు నారాయణ అంగీకరించడం విశేషం. అంటున్నారు.

ఇక రాజకీయాలకు అతీతంగా వేమిరెడ్డి నారాయణల మధ్య మంచి స్నేహం ఉందని. వ్యాపార బంధాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతే కాదు కొన్ని సందర్భాలలో నారాయణకు వేమిరెడ్డి ఆర్ధికంగా సాయపడ్డారని కూడా ప్రచారం సాగుతోంది. దాంతో ఇపుడు నారాయణ కూడా తన త్యాగం చూపించి వేమిరెడ్డి పట్ల స్నేహభావం తెలిపారు అని అంటున్నారు

నిజానికి చూస్తే టీడీపీలోకి కొంతమంది కీలక నేతలు రావ్డానికి చూస్తున్నారు కానీ లోకల్ గా ఉన్న నేతల నుంచే ఇబ్బంది వస్తోంది. వారు వ్యతిరేకించడమో లేక పార్టీ మారడమో చేస్తున్నారు. కానీ వేమిరెడ్డి విషయంలో నారాయణ చూపించిన చొరవతో టీడీపీ హై కమాండ్ పూర్తిగా ఊపిరి పీల్చుకుని బిగ్ రిలీఫ్ పొందింది అని అంటున్నారు.

అంతే కాదు రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే నారాయణకు ఎమ్మెల్సీ పదవి అయినా వేరే నామినేటెడ్ పదవి అయినా ఇచ్చేందుకు హై కమాండ్ హామీ ఇచ్చింది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే కనుక నెల్లూరులో ఇపుడు టీడీపీకి బిగ్ షాట్ గా వేమిరెడ్డి దొరికారు. ఇప్పటికే ముగ్గురు కీలక రెడ్డి ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు.

ఇపుడు బిగ్ షాట్ వేమిరెడ్డి వైసీపీని వీడారు. అలా చూస్తే కనుక 2019లో కంటే ఈసారి టీడీపీ బలం పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు. అదే టైం లో వేమిరెడ్డి కూడా వైసీపీ అధినాయకత్వం తన కోరికను మన్నించలేదని భావించి ప్రెస్టేజ్ గా తీసుకుని టీడీపీలో ఆ రెండు సీట్లూ సంపాదించారు.

దీంతో ఇపుడు నెల్లూరు పాలిటిక్స్ రసకందాయంలో పడింది. వేమిరెడ్డి వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే ఇపుడు పాలిటిక్స్ ఇక్కడ మారుతోంది. మరి వైసీపీ వేమిరెడ్డిని ఓడించేందుకు ధీటైన మాస్టర్ ప్లాన్ ని రూపొందిస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News