బెంగళూరులో కాళరాత్రి.. విసుగెత్తిన వాహనదారులు సంచలన నిర్ణయం!

ఈ క్రమంలో గత రాత్రి కురిసిన వర్షాల కారణంగా వాహనదారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-10-24 15:28 GMT

భారతదేశంలోని మహానగరాల్లో ఒకటి, భారతదేశంలోనే హై-టెక్ ఇండస్ట్రీ ఏరియా, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ట్రాఫిక్, డ్రైనేజ్ సమస్యల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని అంటారు స్వానుభవం ఉన్నవారు. ఈ క్రమంలో గత రాత్రి కురిసిన వర్షాల కారణంగా వాహనదారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అవును... బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని అంటారు. కర్మకాలి ప్రధానంగా సాయంత్ర సమయాల్లో వర్షం పడితే.. ఇక చెప్పే పనే లేదని అంటారు. ఈ క్రమంలో గత రాత్రి బెంగళూరులో వాహనదారులు మరోసారి అలాంటి భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు. కాళరాత్రిని ఎక్స్ పీరియన్స్ చేశారు!

ఇందులో భాగంగా... రూపేనా అగ్రహార వద్ద వర్షాల కారణంగా నీరు రొడ్లపైకి భారీగా చేరింది. ఈ సమయంలో రద్దీని నివారించడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఫ్లైఓవర్ ను ఓ వైపు మూసివేశారు. దీంతో... వాహనాల్లో కదలిక కనుమరుగైంది. అవి ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.

ఫ్లైఓవర్ పై ఏర్పడిన ఈ భారీ ట్రాఫిక్ ఫలితంగా ముందుకు కదలలేక, వెనక్కి వెళ్లలేక విసుగెత్తిపోయిన వాహదారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... వాహనాలను లాక్ చేసి అక్కడే వదిలేసి నడుచుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News