చెప్పాడంటే చేస్తాడంతే... ఉద్దానానికి ఊపిరిలూదిన జగన్
అవును... దశాబ్దాలుగా ఉద్దానం వాసులను వేధిస్తున్న ప్రధాన సమస్య కిడ్నీల సమస్య అనేది తెలిసిన విషయమే
ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి సమస్యలపై స్పందించడం.. అధికారంలోకి వచ్చిన అనంతరం లైట్ తీసుకోవడం వంటివి జరగబట్టే స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయినా ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలవలేకపోయిందని చెబుతుంటారు. అందుకే ఇప్పటికే దేశంలో బెంజ్ లు ఎన్ని ఉన్నాయో గంజి తాగి బ్రతుకు వెళ్లదీస్తేవారూ అంతేమంది ఉన్నారని చెబుతుంటారు. ఈ సమయంలో తాను మాటల మనిషిని కాదని.. ప్రతిపక్షంలో ఉండగ ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయే నేతను కాదని జగన్ మరోసారి చెప్పారనే కామెంట్లు వినిపించే సంఘటన తాజాగా జరిగింది.
అవును... దశాబ్దాలుగా ఉద్దానం వాసులను వేధిస్తున్న ప్రధాన సమస్య కిడ్నీల సమస్య అనేది తెలిసిన విషయమే. ప్రాణాలు పోతున్నాయి మహాప్రభో అనినా కూడా పట్టించుకున్న వారే కరువయ్యారనే కామెంట్లు కోకొల్లలు. కేవలం రాజకీయ లబ్ది కోసమే తప్ప గత ప్రభుత్వాలు చేసింది లేదనేది స్థానికులు బలంగా చెప్పే మాట. ఏదో తూతూ మంత్రంగా ముసలికన్నీరు కార్చడం, కంటి తుడుపు చర్యలు చేపట్టడం తప్ప ఇప్పటి వరకూ ఉద్దానం పీడిత ప్రజలకు ఏ ప్రభుత్వమూ చేసేందేమి లేదనేది బాధితులు బలంగా చెప్పే మాట.
ఈ సమయంలో జగనన్న పాదయాత్రలో భాగంగా అక్కడి ప్రజలు పడుతున్న బాధలు స్వయంగా చూశారు. ఆస్పత్రుల్లో పడి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి ఆవేదన విన్నారు.. బాధలను చుశారు.. చలించిపోయారు. దీంతో... తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తమ బాధలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హమీ ఇచ్చారు. అయితే చాలామంది రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలాంటిది కాదది అన్నట్లుగా జగన్ చేతల్లో చూపించారు.
ఇందులో భాగంగా... ఉద్దానం పీడిత జనానికి అండగా నిలబడతానని ఇచ్చిన హమీ మేరకు పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సుమారు 50 కోట్లకు పైగా ఖర్చుతో ఆస్పత్రి నిర్మించారు. దీనికి "డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్"గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ సమయంలో కిడ్ని వ్యాధికి గల మూల కారణాలపై పరిశోధన చేసి నివేదిక సిద్దం చేసింది.
రోగం వచ్చాక ట్రీట్ మెంట్ చేయడమే కాకుండా.. అసలు ఆ రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళక సిద్దం చేసింది. అంటే... కార్పోరేట్ స్థాయి వైద్యం ఇక నుండి ప్రతి ఒక్క పేదవాడికి అందేలా చర్యలు తీసుకోనున్నారన్నమాట. ఈ సమయంలో... కిడ్ని రోగంతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే తలంపుతో జగనన్న ఇచ్చిన హమీ మేరకు ఆస్పత్రి నిర్మాణం చేయడమే కాకుండా, రోగానికి మూలమైన నీటి సమస్యను తీర్చేందుకు సుమారు 700 కోట్ల రూపాయలతో స్వఛ్చమైన నీరు అందించేలా శాశ్వత పరిష్కారం చేశారు సీఎం జగన్.
ఇందులో భాగంగా... ఉద్దాన ప్రాంత ప్రజలకు వంశధార నీరు అందించేందుకు సుమారు రూ. 700 కోట్ల వ్యయంతో సుజల ధార ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం నిర్మించింది. ఇందులో ప్రధానంగా... పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీటిని అందించే ప్రాజెక్టును చేపట్టింది. ఈ క్రమంలో ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్లు చొప్పున నీటిని సరఫరా చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించింది.
ఈ క్రమంలో... ఈ నెల 14న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభంకానుంది. దీంతో... ఉద్దానం కిడ్ని రోగులకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేసిన జగన్... అంటూ శ్రీకాకుళం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈన్నెళ్ళుకు తమను తరతరాలుగా వేదిస్తున్న సమస్యకు, చాలామంది రాజకీయ నాయకులకు డ్రామాల పోరాటలకు ఉపయోగపడే సమస్యకు శాస్వత పరిష్కారం చూపిస్తున్నారంటూ జిల్లా వాసులు ఆనందపడుతున్నారు.