టీజేఎస్ పొత్తుతో లాభమేంటి ?

దాన్ని వెనుకనుండి ఆడించిందంతా కేసీయారే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రొఫోసర్ జయశంకర్ చనిపోయిన తర్వాత కేసీయారే జేఏసీ ఏర్పాటుచేసి దాన్ని ప్రొఫెసర్ చేతిలో పెట్టారు.

Update: 2023-11-01 14:30 GMT

రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయంటే రెండింటికి ఉపయోగముండాలి. లేదంటే రెండుపార్టీలకు కాస్త అటుఇటుగా అయినా లాభం జరగాలి. అలా కాకుండా పొత్తు పెట్టుకున్న పార్టీతో ఎలాంటి ఉపయోగం లేదని తెలిసినా పొత్తు పెట్టుకుంటే ఏమవుతుంది ? ఇపుడిదంతా ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణా జన సమితి (టీజేఎస్) తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది. సీట్ల కేటాయింపు చర్చలు కాకుండా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉంటోంది కాబట్టి పొత్తు పెట్టుకున్నట్లుంది.

ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు టీజేఎస్ వల్ల ఏమన్నా ఉపయోగముంటుందా ? అన్నదే పాయింట్. ప్రొఫెసర్ ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సమయంలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ప్రత్యేక తెలంగాణా వచ్చిందంటే తన నాయకత్వంలోని జేఏసీ పోరాటాల వల్లే అని భ్రమపడ్డారు. నిజానికి ప్రొఫెసర్ ఒక తోలుబొమ్మ లాంటి వ్యక్తిమాత్రమే. దాన్ని వెనుకనుండి ఆడించిందంతా కేసీయారే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రొఫోసర్ జయశంకర్ చనిపోయిన తర్వాత కేసీయారే జేఏసీ ఏర్పాటుచేసి దాన్ని ప్రొఫెసర్ చేతిలో పెట్టారు.

కేసీయార్ ను చూసే వివిధ పార్టీల వాళ్ళు జేఏసీలో చేరారు కానీ ప్రొఫెసర్ ను చూసికాదు. జరిగిన ఉద్యమాలు, ఉద్యమాలు జరిగిన తీరు, ఉద్యమ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలన్నీ కేసీయార్ డైరెక్షన్ ప్రకారమే జరిగింది కానీ ప్రొఫెసర్ వల్ల కానేకాదు. అయితే తెలంగాణా ఉద్యమం జరిగినా, తెలంగాణా వచ్చినా తన పోరాటాల వల్లే వచ్చిందనే భ్రమలో పడిపోయారు ప్రొఫెసర్. కేసీయార్ ముఖ్యమంత్రి అవ్వగానే తనను నెత్తిన పెట్టుకుంటారని అనుకున్నారు.

అయితే సీఎం కాగానే కేసీయార్ దూరంగా పెట్టేయటంతో ప్రొఫెసర్ కు తత్వం బోధపడింది. తర్వాత భ్రమలు చాలావరకు తొలగిపోయినట్లున్నాయి. అయినా పోయిన ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీచేశారు. ప్రొఫెసర్ తో సహా ఎవరికీ డిపాజిట్లు కూడా దక్కలేదు. దాంతో భ్రమల్లో నుండి ప్రొఫెసర్ వాస్తవంలోకి వచ్చినట్లున్నారు. ఇలాంటి ప్రొఫెసర్ నాయకత్వంలోని టీజేఎస్ తో కాంగ్రెస్ ఎందుకు పొత్తుకున్నదో అర్ధంకావటంలేదు. ప్రొఫెసర్ చెబితే వినేవాళ్ళు లేరు ఓట్లేసే వాళ్ళూ లేరు. అయినా కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

Tags:    

Similar News