తెలంగాణా హంగ్ దిశగా...కింగ్ మేకర్ ఎవరో...?
తెలంగాణా ఎన్నికలకు సరిగ్గా ఇరవై నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఓటర్ల తీర్పునకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తెలంగాణాలో నామినేషన్ల ఘట్టానికి తెర లేచింది.
తెలంగాణా ఎన్నికలకు సరిగ్గా ఇరవై నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఓటర్ల తీర్పునకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తెలంగాణాలో నామినేషన్ల ఘట్టానికి తెర లేచింది. పొలిటికల్ పోలరైజేషన్ కూడా జరుగుతోంది. ఎక్కడివారు అక్కడికి చేరుకుంటున్నారు.
అటు అధికార బీయారెస్ సెంచరీ కొడతామని చెబుతోంది కానీ సింపుల్ మెజారిటీ వస్తే చాలు అన్నట్లుగానే లోపల సీన్ ఉంది అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి కూడా అదేనని అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కి కూడా తెలంగాణాలో అరవై సీట్లు రావాలంటే అతి పెద్ద మ్యాజిక్ జరగాలి.
2018లో 19 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇపుడు మూడు రెట్లు కంటే ఎక్కువ సీట్లను సాధించాల్సి ఉంది. మరి అంతటి వేవ్ కాంగ్రెస్ కి ఉందా అన్నది పెద్ద ప్రశ్న. ఇక కాంగ్రెస్ ప్రభంజనం అని ఎంత చెప్పుకుంటున్నా కాంగ్రెస్ బలం ఆ రెండు జిల్లాలలోనే ఎక్కువగా ఉంది అని అంటున్నారు. అవి నల్గొండ ఖమ్మంగా చెబుతున్నారు. ఈ రెండింటిలో ఎనభై శాతం సీట్లు సాధించిన ఇరవై కంటే ఎక్కువ దక్కవు. ఇక హైదరాబాద్ లో ఉన్న సీట్లలో ఈసారి కాంగ్రెస్ హవా చూపుతుంది అనుకున్నా మజ్లీస్ ఉన్న ఏరియాను తీసేస్తే మిగిలిన వాటిలో మెజారిటీ గెలిచినా ఆ సంఖ్య కూడా పది నుంచి పన్నెండు దాకా మించదు అంటున్నారు.
అలా ముప్పయి సీట్లు కాంగ్రెస్ కి దక్కినా సింపుల్ మెజారిటీకి సగం దగ్గరే ఆగుతుంది. మిగిలిన జిల్లాలలో బీయారెస్ తో హోరా హోరీ తలపడాల్సి ఉంటుంది. అక్కడంతా బీయారెస్ కి గట్టి పట్టుంది. దాంతో కాంగ్రెస్ పెరిగిన గ్రాఫ్ లో మరో ఇరవై సీట్లు గెలుచుకున్నా టోటల్ గా యాభై దగ్గర ఆగుతుంది అని అంటున్నారు. ఇక బీజేపీ హైదరాబాద్ సిటీ మీదనే ఆధారపడి ఉంది. అలాగే కరీంనగర్ లాంటి చోట ఒకటి అరా సీట్లు దక్కినా అరడజన్ సీట్లు ఆ పార్టీకి రావచ్చు.
మజ్లీస్ కి ఎనిమిది దాకా సీట్లు దక్కుతాయని అంటున్నారు. ఈ లెక్క తీసుకుంటే మూడు పార్టీలు కలుపుకుని 64 దాకా సీట్లు తీసుకుంటే బీయారెస్ సింపుల్ మెజారిటీకి దగ్గరగా వచ్చి ఆగిపోవచ్చు అని అంటున్నారు. అన్ని రకాలైన సర్వేలూ అదే విషయం చెబుతున్నాయి. అంటే బీయారెస్ 55 సీట్ల దగ్గర ఉండొచ్చు అన్నది స్థూలంగా ఒక్క లెక్క కనిపిస్తోంది.
ఇక్కడ కాంగ్రెస్ 50, బీయారెస్ 55 అంటే రెండూ పోటా పోటీగానే ఉంటూ వస్తాయన్న మాట. హంగ్ అసెంబ్లీ వస్తుంది అన్నది కూడా అనేక సర్వేల బట్టి అర్ధం అవుతోంది. మరి హంగ్ వస్తే కింగ్ మేకర్ ఎవరూ అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.
బీయారెస్ కి 55 దాకా సీట్లు వస్తే ఈసారి మజ్లీస్ పార్టీ కింగ్ మేకర్ అవుతుంది అని అంటున్నారు. కీలక మంత్రిత్వ శాఖలను కూడా తీసుకుని గులాబీ పార్టీకి పతంగి పార్టీ అండగా ఉంటుందని అంటున్నారు. టోటల్ గా చూస్తే 2018 ఎన్నికల ఫలితాల ముందు కేసీయార్ ఇంటికి వెళ్లి మీకే మా మద్దతు అని చెప్పిన అసదుద్దీన్ ఒవైసీకి ఇపుడు మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎటు నుంచి ఎలా లెక్క చూసుకున్నా హంగ్ దిశగానే తెలంగాణా రాజకీయం సాగుతోంది అని అంటున్నారు.