డెమోక్రాట్ల ఉపాధ్యక్షుడి పై క్లారిటీ.. ఎవరంటే?

అమెరికాకు చెందిన ప్రధాన మీడియా సంస్థల వార్తల ప్రకారం చూస్తే.. మిన్నెసొటా గవర్నర్ గా ఉన్న టిమ్ వాల్ట్స్ ఎంపికైనట్లుగా పేర్కొంటోంది.

Update: 2024-08-07 05:17 GMT

అధికారికంగా కాకున్నా అనధికారంగా డెమోక్రాట్ల ఉపాధ్యక్ష పదవికి పోటీ పడే అభ్యర్థిపై తాజాగా వెలుగు చూసిన సమాచారం ఆసక్తికరంగా మారింది. డెమోక్రాట్ల ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వాల్సిన వేళలో దాదాపు ఖరారు అయినట్లుగా చెబుతున్నారు. ఇంతకూ ఆయన ఎవరంటే..మిన్నెసొటా గవర్నర్ గా వ్యవహరిస్తున్న టిమ్ వాల్ట్స్. 2018నుంచి దాదాపు పన్నెండుళ్లు గవర్నర్ గా సేవలు అందించిన ఆయనే బరిలోకి వస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ఎంపిక మీద అధికారిక ప్రకటన రాలేదు. అనధికారికంగా టిమ్ వాల్ట్స్ పేరు బయటకు వచ్చింది.

అమెరికా అధ్యక్ష రేసులోకి అధికార డెమోక్రాట్ల అభ్యర్థిగా తొలుత ఎంపికైన జో బైడెన్ స్థానంలో కమలా హ్యారిస్ రావటం.. అధికారికంగా ప్రకటించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్ల అభ్యర్థి ఎవరన్న దానిపై అస్పష్టత నెలకంది. అమెరికాకు చెందిన ప్రధాన మీడియా సంస్థల వార్తల ప్రకారం చూస్తే.. మిన్నెసొటా గవర్నర్ గా ఉన్న టిమ్ వాల్ట్స్ ఎంపికైనట్లుగా పేర్కొంటోంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఆయనే ఉపాధ్యక్ష రేసులోకి వస్తారని చెబుతున్నారు.

ఇంతకూ టిమ్‌వాల్ట్స్ ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? రిపబ్లికన్ల విషయంలో ఆయన తీరు ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తికర అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. తనకు అవకాశం లభించిన ప్రతి సందర్భంలోనూ రిపబ్లిక్ పార్టీని చీల్చి చెండాడే ఆయన ట్రంప్ తో పాటు.. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ లపైనా విమర్శలు సంధించే విషయంలో తగ్గేదేలేదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. టీచర్ గా.. ఫుట్ బాల్ ట్రైనర్ గానే కాదు.. ఆర్మీ నేషనల్ గార్డ్ లో 24 ఏళ్ల పాటు సేవలు అందించారు.

డెమోక్రాట్ల ఉపాధ్యక్షఅభ్యర్థి ఎవరన్న రేసు విషయంలో పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో.. మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్ట్స్ ఇరువురు పోటీ పడగా.. చివరకు టిమ్ వాల్ట్స్ ను ఎంపిక చేశారని.. అధికారికంగా ప్రకటించాల్సి ఉందని చెబుతున్నారు. రాజకీయాల్లోకి రాక ముందే టిమ్.. మిన్నెసోటాలోని మంకాటోలో హైస్కూల్ టీచర్ గా.. ఫుట్ బాల్ ట్రైనర్ గా పని చేశారు. మాస్టర్ సార్జెంట్ గా రిటైర్ర అయ్యాక.. 2006లో యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు ఎంపికయ్యారు. 2018లో గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఆయన తన హయాంలో బోలెడన్న సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నారన్న పేరుంది.

Tags:    

Similar News