జగన్ బాబు దగ్గర క్లియర్ కట్ సర్వేలు ..!?
జగన్ కుటుంబంతో ఈ నెల 17న లండన్ టూర్ పెట్టుకుంటే 19న చంద్రబాబు కుటుంబంతో సహా అమెరికా వెళ్లారు అని వార్తలు వచ్చాయి.
ఏపీలో పోలింగ్ జరిగి ఇప్పటికి సరిగ్గా పదిహేను రోజులు దగ్గర కావస్తోంది. కౌంటింగ్ కి పది రోజుల సమయం కూడా లేదు. ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్న ముఖ్యమంత్రి జగన్, విపక్ష నేత చంద్రబాబు విదేశాలకు వెళ్ళారు. జగన్ కుటుంబంతో ఈ నెల 17న లండన్ టూర్ పెట్టుకుంటే 19న చంద్రబాబు కుటుంబంతో సహా అమెరికా వెళ్లారు అని వార్తలు వచ్చాయి.
ఇక ఇపుడు కౌంటింగ్ కి కౌంట్ డౌన్ కావడంతో అధినేతలు అంతా తిరిగి ఏపీకి వస్తున్నారు అని అంటున్నారు. మరో రెండు రోజులలో చంద్రబాబు ఏపీకి వస్తారని ప్రచారం సాగుతోంది. ఆయన పార్టీ అభ్యర్ధులతో నాయకులతో వరసబెట్టి సమీక్షలు జరుపుతారు అని అంటున్నారు.
పోస్ట్ పోల్ రివ్యూస్ చేయడమే కాకుండా కౌంటింగ్ వేళ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అన్న దాని మీద బాబు నేతలకు సూచనలు ఇస్తారని అంటున్నారు. ఈసారి పోలింగ్ హోరా హోరీగా సాగింది. అంతా వ్యూహాత్మకంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అధికార విపక్ష పార్టీలు పోలింగ్ ప్రక్రియను తమ వరకూ సంతృప్తి స్థాయిలో పూర్తి చేశాయి.
ఎలక్షనీరింగ్ లో ఎవరికి వారు తమదే పై చేయి అని చెప్పుకున్నారు. ఇపుడు దానికి మించిన ప్రక్రియ మిగిలి ఉంది. అదే కౌంటింగ్. కౌంటింగ్ విషయంలో కూడా ఒక పక్కా స్ట్రాటజీ ప్రకారమే ముందుకు వెళ్లాలని ప్రధాన పార్టీలు ఆలోచిస్తున్నాయి.
ఈ విషయంలో చంద్రబాబు అమరావతికి చేరుకున్న వెంటనే ఉండవల్లిలోని తన నివాసంతో సమీక్షలు నిర్వహిస్తారని, అలాగే మంగళగిరి పార్టీ ఆఫీసులోనూ మీటింగ్స్ ఉంటాయని చెబుతున్నారు. మరో వైపు చూస్తే జగన్ ఈ నెల 30న ఏపీకి చేరుకుంటారు అని అంటున్నారు.
జగన్ సైతం కౌంటింగ్ స్ట్రాటజీ ఎలా అన్న దాని మీద పార్టీ నేతలతో చర్చిస్తారు అని అంటున్నారు. అదే విధంగా పోస్ట్ పోల్ సినేరియోని ఆయన పరిశీలించి నేతలకు సూచనలు ఇస్తారు అంటున్నారు. అదే విధంగా ఈసారి తాము గెలుస్తామని వైసీపీ ధీమాగా ఉంది. దాంతో ఆ పార్టీ కౌంటింగ్ వద్ద ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని అనుకుంటోంది.
మరో వైపు చూస్తే ఇంకో ప్రచారం సాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ని వివిధ సంస్థలు చేశాయి. అందులో ప్రముఖ సంస్థలు ఉన్నాయి. అవన్నీ జూన్ 1న చివరి విడత పోలింగ్ ముగియగానే వరసగా టీవీలలో రిలీజ్ చేస్తాయి. అయితే ఈ సర్వేలు అన్నీ అధినేతల వద్దకు ఇప్పటికే చేరాయని అంటున్నారు.
అలా బాబు, జగన్ వద్ద ఫుల్ రిపోర్ట్ ఉందని అంటున్నారు. ఏపీలో ఎవరి అధికారంలోకి వస్తారు అన్న దాని మీద ఎంతో కొంత ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలు బయటపెడతాయని అంటున్నారు. ఇప్పటికే సొంత సంస్థల ద్వారా చేయించుకున్న సర్వే నివేదికలు అధినేతల వద్ద ఉన్నాయి. ఇపుడు వాటికి ధీటుగా ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వే నివేదికలు కూడా ఉంటాయని అంటున్నారు. దాంతో కౌంటింగ్ వేళ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అన్న దానికి కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఉపయోగపడతాయని అంటున్నారు. మొత్తం మీద మెల్లగా ఏపీ రాజకీయం వేడెక్కనుంది అని అంటున్నారు.