జగన్ వర్సెస్ షర్మిల : పవన్ పెద్ద బాంబే పేలుస్తారా ?

దిలా ఉంటే అటు షర్మిల ఇటు జగన్ మధ్యన టీడీపీ కూడా ఈ ఇద్దరి విషయంలో విమర్శలు చేస్తూ వస్తోంది.

Update: 2024-10-26 18:56 GMT

ఏపీలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అలాగే కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం హాట్ టాపిక్ గా సాగుతోంది. ఆస్తులు అన్నీ కూడా తనకు సమానంగా పంచమని షర్మిల డిమాండ్ చేస్తూంటే అవన్నీ జగన్ స్వార్జితం అని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇదిలా ఉంటే అటు షర్మిల ఇటు జగన్ మధ్యన టీడీపీ కూడా ఈ ఇద్దరి విషయంలో విమర్శలు చేస్తూ వస్తోంది. అయితే జనసేన ఈ విషయంలో అయితే ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విషయాలను చాలా సీరియస్ గా చూస్తున్నారు

అయితే ఆయన జగన్ షర్మిల ఆస్తుల వివాదం కంటే కూడా సరస్వతి పవర్ సంస్థకు ఇచ్చిన భూముల మీద వాటికి వచ్చిన అనుమతుల మీద పూర్తి స్థాయిలో స్టడీ చేయమని అధికారులకు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.

పల్నాడు జిల్లా దాచేపల్లి మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన 1515.93 ఎకరాల భూమి ఉంది. ఇది వైఎస్సార్ ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉండగా అప్పట్లో జగన్ పరిశ్రమల స్థాపనకు అనుమతించారు. అయితే ఇక్కడ భూములను రైతుల నుంచి జగన్ కొనుగోలు చేశారు అని అంటున్నారు

పరిశ్రమలు వస్తాయని రైతులు భూములు ఇచ్చారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూములు షేర్లు ఇపుడు జగన్ వర్సెస్ షర్మిల వివాదంలో జనంలోకి చర్చకు వస్తున్నాయి. ఈ భూములను జగన్ అప్పట్లో రైతుల నుంచి తీసుకుని పరిశ్రమల స్థాపన చేస్తారు అని చెప్పారని అంటున్నారు.

అయితే అక్కడ ఈ రోజు వరకూ ఏ పరిశ్రమ రాలేదని కూడా అంటున్నారు. దాంతో పాటు ఈ భూములు సంస్థ ఆస్తులు అన్నీ కూడా ఈడీ అటాచ్ లో ఉన్నాయని కూడా అంటున్నారు. అయితే ఈ భూముల విషయంలో పవన్ స్టడీ చేసేది ఏంటి అంటే అక్కడ ప్రకృతి సంపద ఉందని, అలాగే, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే వార్తలు వెలుగులోకి రావడంతో అధికారులతో దీని మీద దృష్టి పెట్టమని కోరారని అంటున్నారు.

ఈ వ్యవహారాలు మొత్తం అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగానూ ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిధిలోకి వస్తాయని అంటున్నారు. దాంతో సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో ఎంత విస్తీర్ణంలో అటవీ భూములు ఉన్నాయనే దానిపై వివరాలతో నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను, పల్నాడు జిల్లా యంత్రాంగాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారని అంటున్నారు. ఇక ఇదే అంశంపై అధికారులతో పవన్ చర్చించారని చెబుతున్నారు.

అంతే కాదు, ఇదే సంస్థకు చెందిన భూములలో ప్రభుత్వానికి చెందిన భూములు, అలాగే జల వనరులు, అటవీ భూములు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కూడా పవన్ భావిస్తున్నారని అంటున్నారు. ఆయన ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులకు ఇదే విషయం మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు.

ఇక ఈ సంస్థ భూములలో వాగులు, వంకలు, కొండలు ఉన్నందున పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారో కూడా తెలియజేయాలని పీసీబీని పవన్ ఆదేశించారని తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే కనుక ఈ అంశంపై అటవీ, రెవెన్యూ, పీసీబీ ఉన్నతాధికారులతో త్వరలో డిప్యూటీ సీఎం సమీక్షించనున్నట్లుగా అయితే ప్రచారం సాగుతోంది.

అదే కనుక నిజమైతే పవన్ సైలెంట్ గా ఎంటర్ అయి పెద్ద బాంబే పేలుస్తారా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఎందుకంటే ఈ భూముల విషయంలో వివాదాలు చాలా ఉన్నాయి. లీజుకు ఈ భూములు ప్రభుత్వం ఇచ్చిందని టీడీపీ నేతలు అంటున్నారు. అలా కాదు రైతుల నుంచి జగన్ తీసుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. మరో వైపు ఇక్కడ పర్యావరణానికి విఘాతం ఏర్పడింది అని కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈడీ అటాచ్ లో ఉన్న ఈ భూముల విషయంలో ఇంకా చర్యలు అయితే లేవు. ఇపుడు ప్రభుత్వం కనుక ఎంటర్ అయితే ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News