చంద్రబాబు కేసులో సీబీఐ ఎంట్రీ ఇస్తే ఏమవుతుంది...?
ఇదిల ఉంటే ఈ కేసులో అటు ఉండవల్లి పట్టుదల ఇటు ప్రభుత్వం కూడా సీబీఐకి కేసు అప్పగించడం మీద సుముఖత వ్యక్తం చేయడంతో సీబీఐ ఈ కీలక దశలో ఎంట్రీ ఇస్తే ఏమవుతుంది అన్న చర్చ కూడా సాగుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు మీద సీఐడీ పెట్టిన స్కిల్ కార్పోరేషన్ డెవలప్మెంట్ కేసులో ఏకంగా 52 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఇటీవలనే ఆయన మధ్యంతర బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రాకపోతే ఈ నెల యధాతధంగా రాజమండ్రి జైలుకు వెళ్తారు.
అయితే ఈ కేసు విషయంలో సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ సందర్భంగా హైకోర్టులో ప్రభుత్వం తరఫున న్యాయవాదులు స్కిల్ కేసుని సీబీఐకి అప్పగిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరాం ఈ కేసు విషయం మీద మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద సిట్ ని వేసి మరీ ప్రస్తుత ప్రభుత్వం వాటిలో అవినీతి మీద విచారిస్తోందని చెప్పారు.
ఇక స్కిల్ స్కాం కేసు విషయంలో కేంద్రాన్ని రెస్పాండ్ కమ్మని కోరినట్లుగా చెప్పుకొచ్చారు. అంతే కాదు సీబీఐకి ఈ కేసు అప్పగించాలని కోరినట్లుగా పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో ఇప్పటీకినా సీబీఐకి అప్పగించాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నిస్తూ సీబీఐకి స్కిల్ స్కాం కేసు అప్పగించడానికి అభ్యంతరం లేకపోతే కౌంటర్ దాఖలు చేయమని సూచించినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 29న ఈ కేసులో విచారణ సందర్భంగా దాన్ని దాఖలు చేయాలని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
ఇదిల ఉంటే ఈ కేసులో అటు ఉండవల్లి పట్టుదల ఇటు ప్రభుత్వం కూడా సీబీఐకి కేసు అప్పగించడం మీద సుముఖత వ్యక్తం చేయడంతో సీబీఐ ఈ కీలక దశలో ఎంట్రీ ఇస్తే ఏమవుతుంది అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే సీబీఐ ఈ కేసులో సీరియస్ గా రంగంలోకి దిగితే మాత్రం టీడీపీ అధినాయకుడికి ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు.
ఒక వేళ అలా కాకుండా జరిగితే మాత్రం భూమి బద్ధలయ్యే పరిణామాలు ఏమీ జరగవు అని అంటున్నారు. ఏపీలో సీబీఐ టేకప్ చేసిన వైఎస్ జగన్ ఆస్తుల కేసు, అలాగే వైఎస్ వివేక దారుణ హత్య కేసు, అలాగే తెలంగాణాలో బీయారెస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత మీద ఉన్న లిక్కర్ స్కాం కేసు వంటి వాటిలో నెమ్మదిగా విచారణ సాగుతున్న వైనాన్ని చూసిన వారు అంతా సీబీఐ ఎంట్రీ వల్ల ఉపద్రవాలు అయితే జరిగిపోవు అనే అంటున్నారు.
అంతే కాదు చంద్రబాబు దగ్గరవారే ఏపీ బీజేపీ నాయకత్వంలో ఉన్నారు. అలా తమ పలుకుబడితో ఈ కేసులో ఏమైనా ఎవరినైనా ప్రభావితం చేస్తారని కూడా అనుమానిన్స్తున్నారని ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకి సీరియస్ ఎంత ఉంది అన్న దాని మీదనే చంద్రబాబుకు వచ్చే ఇబ్బందులు ఆధారపడి ఉంటాయని అంటున్నారు. మొత్తానికి సీబీఐ ఎంట్రీ అంటున్నా ఏమీ జరిగేది అయితే ఉంటుందా అనేది పెద్ద డౌట్ గా ముందుకు తెస్తున్నారు.