హైదరాబాద్ ఏపీకి శాశ్వత రాజధాని అయ్యేదా...?
ఏపీకి రాజధాని ఏదీ అంటే అమరావతి అని గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అమరావతిని మూడు రాజధానులుగా చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ దిశగా చట్టాన్ని చేసి ఆ తరువాత ఉప సంహరించుకుంది. ఇక ఏపీ రాజధాని అమరావతి మీద హై కోర్టులో కేసు నడచింది. చివరికి అమరావతి రాజధాని అని తీర్పు కూడా వచ్చుంది.
ఏపీకి రాజధాని ఏదీ అంటే అమరావతి అని గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అమరావతిని మూడు రాజధానులుగా చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ దిశగా చట్టాన్ని చేసి ఆ తరువాత ఉప సంహరించుకుంది. ఇక ఏపీ రాజధాని అమరావతి మీద హై కోర్టులో కేసు నడచింది. చివరికి అమరావతి రాజధాని అని తీర్పు కూడా వచ్చుంది.
దాని మీద సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఇపుడు ఆ కేసు విచారణ దశలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే మరో ఏడాది లో అంటే 2024 జూన్ 2 నాటికి మనకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మీద హక్కులు పూర్తి స్థాయిలో దక్కకుండా పోతున్నాయి.
నిజానికి విభజన చట్టం మేరకు ఏపీకి తెలంగాణాకు పదేళ్ల పాటు రాజధానిగా హైదరాబాద్ ని ఉంచారు. ఆ ఆ కాలం కనుక సరిపోకపోతే మరో అయిదేళ్ళు పెంచే అవకాశం కూడా ఉందేది. ఇక హైదరాబాద్ నే ఉమ్మడి రాజధానిగా చేసుకుని ఉంటే అది పంజాబ్ హర్యానాలకు చండీగడ్ మాదిరిగా శాశ్వత రాజధానిగా అయ్యేదని నిపుణులు అంటున్నారు
ఆ విధంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడం వల్ల కలిగే లాభం ఏంటి అంటే మనకు వేలాది ఎకరాలు గుంటూరు జిల్లాలో రాజధాని పేరుతో పచ్చటి పొలాలు కాంక్రీట్ జంగిల్స్ గా మరే అవకాశం తప్పేది. అంతకు మించి లక్షల కోట్లు రాజధాని కోసం ఖర్చు చేయడం తప్పేది. దాంతో పాటు షెడ్యూల్ 9,19లలో పేర్కొన్నట్లుగా ఏపీకి హైదరాబాద్ లో ఉనన్ లక్షన్నర విలువ చేసే ఆస్తులు కూడా ఏపీకే చెంది వినియోగంలో ఉండేవి.
అన్నింటికీ మించి ఏపీని మరింతగా ఆయా నిధులతో అభివృద్ధి చేసుకునే వీలు ఉండేది ఇపుడున్న టెక్నాలజీలో రాజధాని ఎక్కడ ఉంది అన్నది ప్రధానం కానే కాదు. అదే విధంగా చూసుకుంటే హైదరాబాద్ లో మూడింతలు ఏపీకి చెందిన వారే ఉన్నారు. అక్కడే ఏపీ రాజధాని ఉంటే మన వాటా మన ప్రగతి మన గమ్యం మన ప్రస్థానం వేరే విధంగా ఉండేవి.
ఇక అమరావతి రాజధానా మూడు రాజధానులా అనుకుంటూ పుణ్య కాలం గడిపేస్తూ ఇబ్బందులు పడే ప్రమాదమూ తప్పేది. ఏపీలో పెట్టుబడుల కోసం రావాల్సిన వారు అంతా హైదరాబాద్ కే దర్జాగా వచ్చేవారు. కానీ ఆ అవకాశం పోయింది అంటే 2015లో చంద్రబాబు ఆదరాబాదరాగా విజయవాడకు వచ్చేయడమే అని అంటున్నారు అంతా. దీని మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి పదేళ్ళు హైదరాబాద్ రాజధాని అంటే దాన్ని అనవసరంగా వదిలేసుకున్నామని అవేదన వ్యక్తం చేశారు.
ఏపీకి కూడా హైదరాబాద్ శాశ్వత రాజధని అయ్యేదని ఆయన అంటున్నారు. అయితే ఇపుడు ఏపీలో రాజధాని రగడ కాస్తా సామాజిక రగడగా రాజకీయ రగడగా మారిపోయింది. అందువల్లనే ఏపీ ఉన్న హక్కు అయిన హైదరాబాద్ ని వదులుకుని కొత్తగా ఏపీలో ఏమీ చేసుకోకుండా అలా పడి ఉంది అన్న భావన అయితే అంతటా ఉంది. హైదరాబాద్ మీద హక్కులను ఏపీ వదులుకోవడం నిజంగా బాధాకరమనే మేధావులు కూడా అంటారు.
ఇక ఏపీకి ఆత్మగౌరవం, రాజధాని ఉండవద్దా అని ప్రశ్నించే వారు కానీ బడా పార్టీల అధినేతలు కానీ ఉండేది హైదారాబాద్ లోనే ఉన్న విషయం అర్ధమైతే ఆ వాదనలో డొల్లతనమూ అర్ధం అవుతుంది. ఇక ఏపీలో ఉన్న వారిలో అత్యధికులు ఈ రోజుకీ హైదరాబాద్ లో ఉపాధి వ్యాపారాల నిమిత్తం ఉంటున్నారు
అందువల్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని ఖరారు చేసుకుని ఏపీలో విజయవాడ, కర్నూల్, విశాఖలను అభివృద్ధి చేసుకుంటే రెండిందాలా మేలు జరిగేది అన్న మాట అయితే ఉంది. మరి మన నాయకులు ఎందుకు ఇలా చేశారు అంటే జవాబు అందరికీ తెలుసు అనే అంటారు.