తప్పుడు కంప్లైంట్.. ఆమెకు రూ.50వేలు కోర్టు ఫైన్!

తాజాగా ఒక మహిళకు మహబూబాబాద్ జిల్లా కోర్టు ఫైన్ తో మొట్టికాయ వేసింది. తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేసి.. కేసు నమోదు చేయించిన బాలిక తల్లిపై కోర్టు సీరియస్ అయ్యింది.

Update: 2024-04-13 03:42 GMT

స్వార్థంతో తప్పుడు ఫిర్యాదులిస్తే షాకులు తప్పవన్న విషయాన్ని న్యాయస్థానం మరోసారి ప్రూవ్ చేసింది. తాజాగా ఒక మహిళకు మహబూబాబాద్ జిల్లా కోర్టు ఫైన్ తో మొట్టికాయ వేసింది. తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేసి.. కేసు నమోదు చేయించిన బాలిక తల్లిపై కోర్టు సీరియస్ అయ్యింది. ఇందుకు బదులుగా ఆమెకు భారీ ఫైన్ వేసి షాకిచ్చింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

తన కుమార్తెపై అత్యాచారం జరిగిందంటూ ఒక మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది. పెద్ద వంగర పోలీసు స్టేషన్ లో దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ ఇచ్చింది. 2023 సెప్టెంబరు 23న జరిగిన ఈ ఉదంతంలో.. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఒక యువకుడిపై అప్పటి ఎస్ఐ రాజు పోక్సో కేసు నమోదు చేయటంతో పాటు.. కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు ఆర్నెల్లుగా కోర్టులో నడుస్తోంది.

అయితే.. కోర్టులో సాక్ష్యులను విచారిస్తున్న క్రమంలో బాలిక తల్లి తప్పుడు కంప్లైంట్ చేసినట్లుగా గుర్తించారు. దీంతో స్పందించిన న్యాయస్థానం ఆమెకు రూ.50వేలు ఫైన్ విధించింది. ఒకవేళ ఆ మొత్తాన్ని కట్టలేని పక్షంలో మూడు నెలలు జైలుశిక్ష అనుభవించాలని మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News