మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం...మోడీ సర్కార్ సంచలనం.

అలాంటి దాన్ని ఇపుడు బయటకు తీసి అత్యంత కీలకమైన బిల్లుగా నరంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదించనుంది.

Update: 2023-09-18 16:59 GMT

ఎప్పటి మహిళా బిల్లు. ఎప్పటి రిజర్వేషన్ల వ్యవహారం దాదాపుగా మూడు దశాబ్దాల కాలం గడచింది. అయినా అతీ గతీ లేదు. అలాంటి దాన్ని ఇపుడు బయటకు తీసి అత్యంత కీలకమైన బిల్లుగా నరంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదించనుంది.

ఈ బిల్లుని ఈ నెల 20న లోక్ సభలో ప్రవేశపెడతారు అంటున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుని ఈ నెల 20న లోక్ సభ ముందుకు తెస్తారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ప్రత్యేకమైన బిల్లులు ఆమోదం కోసం ప్రవేశపెడతారు అని అంతా అనుకుంటున్న సంగతి విధితమే.

ఇపుడు మోడీ ప్రభుత్వం అదే పని చేస్తోంది. లోక్ సభలో మోడీ సర్కార్ కి 340 మంది ఎంపీల దాకా బలం ఉంది మిత్రులు ఎటూ ఉన్నారు. కాంగ్రెస్ సైతం మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని లేఖ రాసింది. దాంతో ఆ పార్టీ దాని మిత్రులు కూడా మద్దతు ఇస్తారని తెలుస్తోంది.

దాంతో ఈ బిల్లు మూడింట రెండు వంతుల మెజారిటీ అంటే 67 శాతం కంటే ఎక్కువ మద్దతుతోనే లోక్ సభలో ఆమోదం పొందడం ఖాయమని అంటున్నారు. రాజ్యసభ లో తీసుకుంటే 2010 ఈ బిల్లు ఆమోదం పొందింది అని అంటున్నారు. రాజ్యసభ శాశ్వత సభ కాబట్టి అక్కడ ఆమోదం పొందిన బిల్లుని మళ్లీ తీసుకుని వస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

చాలా మంది అవసరం లేదు అని అంటున్నారు. ఒక వేళ అవసరం అయినా కాంగ్రెస్ ఎటూ మద్దతు ఇస్తోంది కాబట్టి అక్కడ కూడా 67 శాతం మద్దతు ఈజీగా దక్కుతుంది అంటున్నారు. మొత్తానికి మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుని కనుక చట్టం చేస్తే చరిత్రలో మిగిలిపోయే పనిచేసినట్లు అవుతుంది. ఆ క్రెడిట్ కూడా మోడీ ఖాతాలో పడనుంది అంటున్నారు.

ఈ బిల్లు కనుక ఆమోదం పొంది చట్టం అయితే మాత్రం పార్లమెంట్, అసెంబ్లీలలోని మొత్తం సీట్లలో 33 శాతం మహిళలకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. టోటల్ గా దేశ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుంది. మహిళా రాజ్యం రావడం ఖాయం. అలాగే ఇప్పటి దాకా ఉన్న ఆధిపత్య వర్గాలు పురుషాధిపత్య వ్యవస్థకు కూడా చెక్ పడుతుంది.

అదే టైం లో కొన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ మహిళా బిల్లు జాతకాన్ని మార్చేస్తుంది అంటున్నారు. మోడీ సర్కార్ సరిగ్గా ఎన్నికలు దగ్గర చేసి ఈ బిల్లుని ఆమోదించుకోవాలనుకోవడం వెనక ఫక్తు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. జనాభాలో యాభై శాతానికి పైగా మహిళలు ఉన్నారు. వారి మద్దతు తమ పార్టీకి గంపగుత్తగా దక్కించుకునే ఎత్తుగడగా ఉంది అని అంటున్నారు.

ఈ విషయం తెలిసినా విపక్షాలు జై కొట్టడం తప్ప చేసేది ఏమీ లేదు, ఎందుకంటే ఎవరు కాదన్న మహిళల దృష్టిలో వారు విలన్లుగా మారుతారు. 1996 లో ఎస్పీ, ఆజేడీ ఈ బిల్లుని వ్యతిరేకించారు. నాడు ఉన్న పరిస్థితులు వేరు. ఇపుడు అలా కాదు కాబట్టి అంతా ఓకే అనాల్సిందే అంటున్నారు.

ఇక 2019లో బీజేపీ మహిళా బిల్లుని చట్టంగా చేస్తామని చెప్పింది. ఇపుడు తన మాటను మోడీ నెగ్గించుకుని ప్రజల ముందుకు వెళ్లబోతున్నారన్న మాట. మొత్తానికి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా చెప్పాలంటే మోడీ సర్కార్ తీసుకున్నది భేషైన నిర్ణయం అని అంటున్నారు అంతా.

Tags:    

Similar News