పురుషులతో కాదు రోబోలతోనే శృంగారం... షాకింగ్ డిటైల్స్!

ఈ క్రమంలో ఫ్యూచర్లజిస్ట్ డాక్టర్ ఇయాన్ పియర్సన్ షాకింగ్ విషయాలు చెప్పారని బ్రిటిష్ న్యూస్ పేపర్ 'ది సన్' నివేదిక తెలిపింది.

Update: 2024-10-08 11:30 GMT

భవిష్యత్తులో మనిషికి మనిషే తోడు ఉండాల్సిన అవసరం లేదని.. శృంగారంలోనైనా అదే సూత్రం వర్తిస్తుందని.. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మాయ అని.. గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫ్యూచర్లజిస్ట్ డాక్టర్ ఇయాన్ పియర్సన్ షాకింగ్ విషయాలు చెప్పారని బ్రిటిష్ న్యూస్ పేపర్ 'ది సన్' నివేదిక తెలిపింది.

అవును... భవిష్యత్తులో మహిళలు తమ లైంగిక అవసరాలకోసం పురుషులను పక్కనపెట్టి రోబోలను ఆశ్రయిస్తాయంటూ ఫ్యూచర్లజిస్ట్ డాక్టర్ ఇయాన్ పియర్సన్ వెల్లడించారు! మహిళలు రాబోయే 10 సంవత్సరాలలో రోబోట్ లతో శృంగారం కోసం పురుషులను వదులుకుంటారని.. 2025 నాటికే ధనిక కుటుంబాల్లో రోబోట్ సె*క్స్ రూపాలు పుట్టుకొస్తాయని అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో... మానవుల ఆలోచన ప్రస్తుతం ఈ దృష్టికి దూరంగా లేదని.. సె*క్స్ టాయ్స్, వైబ్రేటర్ లు ప్రధానంగా మార్కెట్ లోని ప్రవేశించిన ఉదాహరణలను ఉటంకిస్తున్నారు. అదేవిధంగా అశ్లీల చిత్రాలు చూడటం కంటే కూడా రోబోట్ లతో సె*క్స్ చేయడం బాగా ప్రాచుర్యం పొందడానికి ఎక్కువ కాలం ఉండదని సూచించారు.

2050 నాటికి రోబోట్ సె*క్స్ సర్వసాధారణం అవుతుందని.. ఫలితంగా... మనుషుల మధ్య ప్రేమను ఇది పూర్తిగా మరుగుపరుస్తుందని పియర్సన్ అంచనావేశారు. మరోపక్క 2030 నాటికి వర్చువల్ రియాలిటీ సె*క్స్ కామన్ అవుతుందని ది రైజ్ ఆఫ్ ది రోబో సెక్యువల్ అంచనా వేసింది. ఇక 2035 నాటికి సె*క్స్ టాయ్స్ వర్చువల్ రియాలిటీ సె*క్స్ తో ముడిపడి ఉంటాయని పేర్కొంది.

అయితే... చాలా అమంది అతని ఆలోచనలను కొట్టిపారేస్తున్నప్పటికీ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోటోట్ ల కలయికతో సె*క్స్ టాయిస్, సె*క్స్ డాల్స్ ల తయారీ విషయంలో పెరుగుతున్న వాటి తయారీ పరిశ్రమ ఆ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News