చైనా, తైవాన్ మధ్య యుద్ధమేఘాలు.. జిన్‌పింగ్ కీలక పిలుపు

డ్రాగన్ దేశం మరోసారి కూన తైవాన్ మీదకు కత్తులు దువ్వుతోంది. మరోసారి ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

Update: 2024-10-20 10:18 GMT

డ్రాగన్ దేశం మరోసారి కూన తైవాన్ మీదకు కత్తులు దువ్వుతోంది. మరోసారి ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. చైనాకు పక్కనే ఉన్న పసికూనపై చైనా ఎందుకు ఈ తీరుగా వ్యవహరిస్తున్నదా అనేది అంతుబట్టని అంశం. మొత్తంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయగా.. ఇప్పుడు చైనా తైవాన్‌ల మధ్య కూడా యుద్ధం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో పరిస్థితులు ఎటువైపు వెళ్తాయో తెలియకుండా ఉంది.

ఇప్పటికే యుద్ధం కోసం చైనా సిద్ధమైంది. అందులోభాగంగానే ఆరు రోజులక్రితం చైనా తైవాన్ చుట్టూ భారీ సైనిక విన్యాసాలు ప్రదర్శించింది. ఈ విన్యాసాలలో యుద్ధనౌకలు, ఫైటర్ జెట్‌లు పాల్గొన్నాయి. వీటిలో 25 విమానాలు, ఏడు నేవీ నౌకలు, మరో నాలుగు నౌకలు పాల్గొన్నట్లు తైవాన్ చెప్పింది.

కొన్ని రోజుల క్రితం తైవాన్ అధ్యక్షుడు విలియం లై. చైనా చేస్తున్న తీవ్రంగా ప్రతిఘటిస్తామని అనౌన్స్ చేశారు. తమపై చైనా నియంత్రణను అంగీకరించేది లేదని వ్యాఖ్యలు చేశారు. దాంతో కోపానికి పోయిన చైనా ఈ సైనిక విన్యాసానికి దిగినట్లు తెలిసింది.

ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన సైన్యానికి కీలక ఆదేశాలు ఇచ్చారు. తాజా ఆదేశాలతో తైవాన్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. యుద్ధానికి సిద్ధం కావాలని జిన్‌పింగ్ తన సైన్యానికి ఆదేశాలు ఇవ్వడమే ఈ ఆందోళనకు కారణమైంది.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు చెంది బ్రిగేడ్‌ను అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇటీవల సందర్శించారు. ఈ సందర్భంగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, ఆ మేరకు సన్నాహాలను ప్రారంభించాలని ఆదేశాలిచ్చారు. దళాలు పటిష్టమైన పోరాట సామర్థ్యాలను కలిగి ఉండేలా చూడాలన్నారు. దేశ భద్రతను కాపాడాలని పేర్కొన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి యుద్ధం తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి.

అమెరికా తర్వాత ఆర్థిక, రక్షణ రంగాల్లో చైనా బలంగా ఉంది. కానీ.. పక్కనున్న కూన అయిన తైవాన్ దేశంపై యుద్ధానికి తహతహలాడడం చర్చకు దారితీసింది. చైనాలోని కనీసం పదో వంతు కూడా బలం లేని తైవాన్ దేశంపై చైనా కూడా ఇంత మొండిగా వ్యవహరించడంపైనా ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు.. తైవాన్ చిన్న దేశమే అయినప్పటికీ చైనాతో ఢీ అంటే ఢీ అంటుండడం మరింత ఆసక్తిని రేపింది. ఏ బలాన్ని చూసుకొని అలా రెచ్చిపోతోందా..? అంత ధైర్యం ఎక్కడిదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News