"శిశువులను చంపి వండిపెట్టేవారు.. మీ శిశువులనే మీరు తిన్నారని చెప్పేవారు"!

ఐసిస్ ఉగ్రవాదుల రాక్షసత్వం గురించి ప్రపంచానికి తెలిసింది మాత్రమే కాదు.. అంతకు మించి ఉందంటూ వాళ్ల చెరలో నుంచి ఇటీవల బయటపడిన ఓ మహిళ వివరించింది

Update: 2024-10-21 00:30 GMT

ఐసిస్ ఉగ్రవాదుల రాక్షసత్వం గురించి ప్రపంచానికి తెలిసింది మాత్రమే కాదు.. అంతకు మించి ఉందంటూ వాళ్ల చెరలో నుంచి ఇటీవల బయటపడిన ఓ మహిళ వివరించింది. ఇది ఎంతో జుగుప్సాకరంగా, అత్యంత పాశవికంగా ఉందని ఆమె వెల్లడించింది. కొన్నేళ్ల క్రితం వారి చెరలో బందీ అయిన ఓ మహిళను తాజాగా ఐడీఎఫ్ రక్షించింది.

అవును... కొన్నేళ్ల క్రితం ఐసిస్ అపహరించిన ఓ మహిళను తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) రక్షించింది. లెబనాన్ భూభాగంలో ఆమెను గుర్తించి.. కుటుంబానికి అప్పగించింది. సుమారు పదేళ్లుగా ఆమె ఐసిస్ చేతిలో బందీగా ఉంది. ఈ సందర్భంగా ఐసిస్ చేతుల్లో ఆమె అనుభవించిన నరకాన్ని వివరించింది.

వివరాళ్లోకి వెళ్తే... ఐసిస్ 2014లో 200 మంది మహిళలు, పిల్లలను బానిసలుగా చేసుకుంది. వారిలో ఫౌజియా అమీన్ సిడో అనే యువతి కూడా ఉంది. అయితే... ఇంతకాలం తర్వాత ఆమెను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ రక్షించింది. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వూలో వెల్లడించింది.

తాను అపరహరణైన సమయానికి ఆమె వయసు తొమ్మిదేళ్లని చెప్పింది. ఆ సమయంలో బందీలైన వారిలో తనతో పాటు తన సోదరి కూడా తనతో ఉందని తెలిపింది. ఈ సందర్భంగా టెర్రరిస్టులు తమకు పెట్టిన ఆహారం గురించి అతంత ఘోర విషయాలు వెల్లడించింది. తమకు అన్నం, మాంసం పెట్టేవారని.. ఇది తింటున్న సమయంలో దుర్వాసన వచ్చిందని చెప్పింది.

ఆ దుర్వాసన వచ్చే ఆహారం తినడం వల్ల చాలా మంది అనారోగ్యాల పాలయ్యారని వెల్లడించింది. ఈ సమయంలో... ఆ మాంసం యజిదీ శిశువులదని వారు తమకు చెప్పినట్లు ఫౌజియా వెల్లడించింది. ఇదే సమయంలో.. చిన్నారులను చంపి, వండుతున్నప్పుడు తీసిన ఫోటోలను చూపిస్తూ.. మీ పిల్లలనే మీరు తిన్నారని చూపించేవారని వెల్లడించింది.

ఈ విషయం తెలిసి.. కనిపించకుండా పోయిన తన బిడ్డలను గుర్తుచేసుకుని ఓ మహిళ క్షణాల్లోనే ప్రాణం విడిచిందని ఫౌజియా తెలిపింది. అక్కడి దారుణ పరిస్థితులకు ఇదొక ఉదాహరణ మాత్రమే అని ఆమె పేర్కొన్నారు. ఇక తన పేరును "సబయా"గా మార్చి జిహాదీ ఉగ్రవాదులకు అమ్మేశారని ఆమె తెలిపింది.

కాగా... 2014లో ఇరాక్ లోని సింజార్ ప్రాంతం నుంచి సుమారు 6,000 మందికి పైగా యాజిదీలను ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు బంధించారు. వీరిలో చాలా మందిని లైంగిక బానిసలుగా విక్రయించగా.. మరికొంతమంది సైనికులుగా శిక్షణ పొందారు. వీరిని టర్కీ, సిరియాతో సహా సరిహద్దుల మీదుగా తీసుకెళ్లబడ్డట్లు చెబుతారు.

Tags:    

Similar News