టీడీపీ - జ‌న‌సేన పొత్తు.. వైసీపీలో మారిన స్ట్రాట‌జీ...!

దీనికి కార‌ణం.. వైసీపీపై పెను ప్ర‌భా వం చూపుతుంద‌నే... భ‌యం వెంట‌డ‌మే. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ-జ‌నసేన‌లు క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నాయి.;

Update: 2023-11-11 23:30 GMT

ప్ర‌త్య‌ర్థి పార్టీల పొత్తు అధికార పార్టీకి ఎక్క‌డైనా సెగ పుట్టించ‌డం ఖాయం. ప్ర‌త్య‌ర్థులు ఏక‌మైతే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా.. వారికి మేలు చేయ‌డంతోపాటు అధికారంలో ఉన్న పార్టీకి ఇబ్బందిగా మారు తుంది. ఇక్క‌డ ఏపీలోనూ ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే ఉంది. ఏపీలోనూ.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఏక‌మ‌వుతున్నాయి. జ‌న‌సేన‌-టీడీపీ వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో క‌లిసిపోటీచేయాల‌ని నిర్ణ‌యించాయి. అంతేకాదు..త‌మ‌కు క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో కూడా ముందుకు సాగ‌నున్నాయి.

స‌హ‌జంగానే ఇలాంటి వ్యూహం అధికారంలో ఉన్న వైసీపీకి సెగ పుట్టిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇదే అభిప్రాయం నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉంది. అంతేకాదు.. ఒంట‌రిగా రండి! ఒంట‌రిగా రండి!! అంటూ వైసీపీ నాయ‌కులు స‌వాల్ రువ్వారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి కార‌ణం.. వైసీపీపై పెను ప్ర‌భా వం చూపుతుంద‌నే... భ‌యం వెంట‌డ‌మే. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ-జ‌నసేన‌లు క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నాయి.

అయితే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ పొత్తులపై ఒకింత ఆవేద‌న‌, ఆందోళ‌న‌వ్య‌క్తం చేసిన వైసీపీ.. ఇప్పుడు త‌న స్ట్రాట‌జీని మార్చుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తుతో త‌మకు మ‌రోర‌కంగా ల‌బ్ధి చేకూరుతుంద‌ని వైసీపీ ప్ర‌ముఖులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌ధానంగా పార్టీలో జంపింగులు ఉండే అవ‌కాశం లేద‌ని లెక్క‌లు వేసుకున్నారు. ఎన్నిక‌ల‌కుముందు స‌హ‌జంగానే అసంతృప్తితో ఉన్న నాయ‌కులు, టికెట్ ద‌క్క‌ని నాయ‌కులు.. జెండాలు మార్చేస్తున్న ప‌రిస్థితి తెలంగాణ ఎన్నిక‌ల్లోస్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఇలాంటి ప‌రిస్థితి ఏపీలోనూ భిన్నంగా ఏమీ ఉండ‌దు. అయితే.. దారులు మూసుకుపోయిన‌ప్పుడు మాత్రం నాయ‌కులు ఎక్క‌డివారు అక్క‌డే ఉండిపోతార‌నేది వైసీపీ వ్యూహం. అంటే.. జ‌న‌సేన - టీడీపీ క‌లిసి బ‌రిలోకి దిగుతున్న క్ర‌మంలో ఆయానియోజ‌క‌వ‌ర్గాల్లో వారి వారి అభ్య‌ర్థులే ఎక్కువ‌గా ఉంటారు కాబట్టి కొత్త‌గా వ‌చ్చే నేత‌ల‌కు అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. సో.. వైసీపీలో ఉన్న‌వారికి టికెట్లు ఇవ్వ‌క‌పోయినా.. పెద్ద‌గా ప్ర‌భావం చూప‌బోద‌నే అభిప్రాయంతో ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌,టికెట్లు ద‌క్క‌క‌పోతే.. స‌హాజంగానే పార్టీలు మారే నాయ‌కులు ఉన్న‌నేప‌థ్యంలో టీడీపీలోకానీ.. జ‌న‌సేన‌లోకి కానీ.. వారు జంప్ చేసే చాన్స్ ఉంది. ఇది గ‌తంలో వినిపించిన మాట‌. కానీ, ఇప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తు లు పెట్టుకున్న‌నేప‌థ్యంలో వైసీపీ నుంచి జంపింగుల‌కు అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని ప‌రిశీల‌కులు కూడా చెబుతున్నారు.

ఒక వేళ జంప్ చేయాల‌ని నాయ‌కులు అనుకున్నా.. ప్రత్యామ్నాయ ప‌ద‌వులు, టికెట్లు ఆశించ‌కుండానే అడుగులు వేయాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. మొత్తానికి టీడీపీ-జ‌న‌సేన పొత్తుపై ముందు కొంత గంద‌రగోళ ప‌డినా.. త‌ర్వాత‌.. వైసీపీ వ్యూహం మార్చింద‌ని పార్టీ నాయ‌కులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News