ఔను.. వైసీపీ హయాంలో ఇది చరిత్రాత్మకమే!!
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు దశాబ్దాలుగా రాష్ట్రంలో అసైన్డ్ భూముల వ్యవహారం.. లంక భూ ముల హక్కుల వ్యవహారం ఎడతెగని ముడిగా ఉంది.
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాల్లో లోపాలు ఉండొచ్చు. కొన్ని తప్పులు కూడా జరిగి ఉండొచ్చు. విపక్షాలు వాటిపై విమర్శలు గుప్పించడం.. కోర్టులు అనేక సందర్భాల్లో తప్పు బట్టడం కూడా చేసి ఉండొచ్చు! కానీ.. తాజాగా అమలు చేస్తున్న పథకం మాత్రం చరిత్రాత్మకమేన ని అంటున్నారు పరిశీలకులు. దీనిపై విపక్షాలు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.
విషయం ఇదీ..
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు దశాబ్దాలుగా రాష్ట్రంలో అసైన్డ్ భూముల వ్యవహారం.. లంక భూ ముల హక్కుల వ్యవహారం ఎడతెగని ముడిగా ఉంది. ఇప్పటికీ 30 నుంచి 40 ఏళ్లుగా కోర్టు కేసుల్లో ఉన్న భూములు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు వాటిని పరిష్కరిస్తామ ని చెప్పడం.. దీనికి అనేక ప్రతిబంధకాలు ఎదురు కావడంతో ఆయా అంశాలను ప్రభుత్వాలు పక్కన పెడుతూ వచ్చాయి. అయితే.. తాజాగా ఈ సమస్యలపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. భూతగాదాలను పరిష్కరించే ఉద్దేశంతో వైసీపీ సర్కారు ముందుకు అడుగులు వేసింది.
రాష్ట్రంలోని అసైన్డ్, లంక భూములకు హక్కులు కల్పించే చరిత్రాత్మక నిర్ణయం దిశగా తీసుకున్న నిర్ణయానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. దీంతో ఇప్పుడు సీఎం జగన్.. ఆయా భూములపై హక్కులు కల్పిస్తూ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాదు.. వచ్చే 20 రోజుల్లోనే వేల మంది సర్వేయర్లతో ఈ భూముల లెక్కలు తేల్చి హక్కు దారులకు పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే.. ఈ అసైన్ఢ్, లంక భూములు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జమీందార్లు కేటాయించిన అసైన్డ్ భూములువివాదాల్లో చిక్కుకున్నాయి. వీటికి మోక్షం కల్పిస్తూ.. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. చరిత్రాత్మకమని అంటున్నారు పరిశీలకులు. ఇక, బ్రిటీష్ హయాంలో నిలిపి వేసిన చుక్కల భూముల సమస్యకు ఇప్పటికే పరిష్కారం చూపించారు
కొసమెరుపు: ఇదే అసైన్డ్ భూములు, చుక్కల భూములు, పోడు భూముల వ్యవహారం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య ప్రచార వనరుగా ఉన్న విషయం తెలిసిందే.