ఇలానే మాట్లాడితే.. షర్మిలకు షాక్ తప్పదు!
ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నా రు.
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు షాక్ తప్పదా? ఆమె విషయంలో వైసీపీ సీరియస్‌గా ఆలోచన చేస్తోం దా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతు న్న టీడీపీ అధినేత, జనసేన అధినేత చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది. ఇప్పుడు షర్మిల కూడా ఇదే దారిలో ఉన్నారు. వీరి కంటే ఎక్కువగానే కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నా రు.
వీటిని కొంత వరకు సహించే అవకాశం ఉన్నా.. శుక్రవారం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధి లోని వేంపల్లెలో నిర్వహించిన రోడ్ షోలలో షర్మిల ఏకంగా.. ఎంపీ అవినాష్‌ను `హంతకుడు` అంటూ.. 10 నుంచి 15 సార్లు పేర్కొన్నారు. హంతకుడికి టికెట్ ఇచ్చారు.. అని వ్యాఖ్యానించారు. ఇవి ఓటర్లను ప్రభా వితం చేసేలా ఉన్నాయన్నది స్థానిక వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శ. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీతలపై వైసీపీ పక్కా ప్లాన్‌తో(వారుతీవ్ర విమర్శలు చేసే వరకు వేచి చూసి) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇదే జరిగితే.. షర్మిల, సునీతల ప్లాన్ బెడిసి కొట్టడం ఖాయమనే చర్చ తెరమీదికి వచ్చింది. 2019 ఎన్నిక ల సమయంలోనూ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసును అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. దీనిపై ఎన్నిక లసంఘానికి వైసీపీ ఫిర్యాదు చేయడంతో చంద్రబాబుపై ఆంక్షలు విధించారు. ఇదేసమయంలో హైకోర్టు కూడా.. వివేకానందరెడ్డి అంశాన్ని ఎన్నికల్లో వినియోగిం చరాదని స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో టీడీపీ వివేకానందరెడ్డి హత్య అంశాన్ని ప్రస్తావించడం మానేసింది. ఇప్పుడు దీనికంటే ఎక్కువగానే షర్మిలపై వేటు వేయించే దిశగా వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.