వైసీపీ ఎమ్మెల్యే థర్డ్ థాట్... పవన్ నుంచి హామీ దొరికిందా?
ఈ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారని తెలుస్తుంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత తన అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా మొదటి నుంచీ పూర్తిస్థాయిలో కాన్సంట్రేషన్ చేస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై శ్రద్ధపెట్టారు. ఈ సమయంలో జిల్లా వ్యాప్తంగా జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల వారీగా మంతనాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పవన్ తో భేటీ అయ్యారన్న విషయం ఆసక్తికరంగా మారింది.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికలో అనూహ్య మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈసారి సీటు దక్కదనే సందేహం ఉన్న పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారని తెలుస్తుంది. కావాలని తాను ఎవరినీ వదులుకోవడం లేదని.. స్థానిక సమీకరణల దృష్ట్యా అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు చేస్తున్నామని.. టిక్కెట్లు దక్కనివారికి మరో రూపంలో న్యాయం చేస్తామని జగన్ చెబుతున్నారని తెలుస్తుంది.
అయినప్పటికీ కొంతమంది నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అందులో భాగంగా టీడీపీ, జనసేనలవైపు చూస్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు.. జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట టిక్కెట్ మాజీ మంత్రి తోట నరసింహానికి ఇవ్వబోతున్నారని తెలుస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో పలు సర్వేలు, కార్యకర్తల సూచనలు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న జగన్... జగ్గంపేటలో ఈ సారి తోట నర్సింహాన్ని రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది. దీంతో జ్యోతుల చంటిబాబు సెకండ్ థాట్ గా టీడీపీ నేతలకు టచ్ లోకి వెల్లారని అంటున్నారు. అయితే... అక్కడున్న జ్యోతుల నెహ్రూ ఈ విషయంలో అడ్డం తగలడంతో... ప్రస్తుతానికి టీడీపీ చంటిబాబుని హోల్డ్ లో పెట్టిందని తెలుస్తుంది.
ఈ సమయంలో థర్డ్ థాట్ కి వెళ్లిన జ్యోతుల చంటిబాబు... కాకినాడ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారని తెలుస్తుంది. సుమారు గంటసేపు జరిగిన ఈ భేటీలో పవన్ - చంటిబాబుతో పాటు నాదేండ్ల మనోహర్, నాగబాబు కూడా ఉన్నారని సమాచారం. అయితే... పొత్తులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ ఖాతాలో పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.
ఇక్కడ నుంచి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి పోటీకి దిగే అవకాశాలు చాలానే ఉన్నాయని తెలుస్తుంది. ఏ టిక్కెట్ దక్కలేదని పవన్ తో చంటిబాబు భేటీ అయ్యారో... పొత్తులో భాగంగా ఆ స్థానం జనసేన ఖాతాలో పడటం ఆల్ మోస్ట్ అసాధ్యం అని అంటున్న వేళ... చంటిబాబుకి పవన్ కల్యాణ్ ఎలాంటి హామీ ఇచ్చారనేది ఆసక్తిగా మారింది.
కాగా... 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి జగ్గంపేటలో పోటీ చేసిన జ్యోతుల చంటిబాబు... 2009లో మూడోస్థానంలో నిలవగా, 2014 లో 15,932 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అనంతరం 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూపై గెలుపొందారు.