ఎల్లో మీడియా ఎల్లో బుక్?

ఏపీలో బుక్కుల రాజ్యం నడుస్తోంది. ప్రతీ వారి చేతిలో బుక్కులు ఉంటున్నాయి. నారా లోకేష్ రెడ్ బుక్ ని మొదట పరిచయం చేశారు.

Update: 2024-10-10 13:04 GMT

ఏపీలో బుక్కుల రాజ్యం నడుస్తోంది. ప్రతీ వారి చేతిలో బుక్కులు ఉంటున్నాయి. నారా లోకేష్ రెడ్ బుక్ ని మొదట పరిచయం చేశారు. తాము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ లో రాసుకున్న పేర్లలో తప్పులు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు. అనుకున్నట్లుగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రెడ్ బుక్ రాజ్యం నడుస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.

టీడీపీ రెడ్ బుక్ కి బదులుగా తాము గుడ్ బుక్ ని తీసుకుని వస్తామని కూటమి ప్రభుత్వంలో మంచిగా పనిచేసిన వారికి తమ ప్రభుత్వం రాగానే మంచిగా చూసుకుంటూ కీలక బాధ్యతలు ఇస్తామని వైసీపీ అధినేత తాజాగా చెప్పారు.

ఈ మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ పేరుతో మరో బుక్ తెచ్చారు. అది సనాతన ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పారు. ఇలా ఎవరి బుక్ వారికి ఉంటే ఎల్లో మీడియా మరో బుక్ తీస్తోంది. అదే ఎల్లో బుక్.

టీడీపీకి అనుకూలంగా ఉండే ఎల్లో మీడియా ఎల్లో బుక్ లో ఎవరు పేర్లు ఉంటాయి అంటే ఠక్కున చెప్పేది సులువుగా వైసీపీ వారివే అని. కానీ ఆలా ఏమీ కాదు, వైసీపీ వారిని ఎల్లో బుక్ టార్గెట్ చేయడం లేదు. టీడీపీ వారినే ఎల్లో బుక్కులోకి ఎక్కిస్తోంది. టీడీపీ కూటమి నేతలు ఎమ్మెల్యేలు చేసిన తప్పులను అందులో పెడుతూ టీడీపీ కూటమి పెద్దలను ఆ విధంగా హెచ్చరిస్తోంది అన్న మాట.

ఏపీలో కూటమి పాలనలో అందరూ కాదు కానీ చాలా మంది ఎమ్మెల్యేలు ప్రతీ నియోజకవర్గంలో చెలరేగిపోతున్నారని తమకు వచ్చిన అపరిమితమైన అధికారాన్ని వాడుకుంటూ వారు దందాలు చేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ల్యాండ్ సాండ్ తో పాటు లిక్కర్ దందాలు కూడా చేస్తూ కూటమి ప్రభుత్వం పరువుని పలుచన చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.

ఎంతో కష్టపడి టీడీపీని చంద్రబాబు అధికారంలోకి తెస్తే ఎమ్మెల్యేలు మాత్రం ఆ స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. వారు మద్యం సిండికేట్లని పెడుతున్నారని కమిషన్లు దందాలతో హడలెత్తిస్తున్నారు అని కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అదే విధంగా చూస్తే నియోజకవర్గాల స్థాయిలో అవినీతి పెచ్చరిల్లుతోందని కూడా ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

ఎమ్మెల్యేల మీద బాహాటంగానే ఆరోపణలు వస్తున్నాయి. చేసేది కూడా టీడీపీ సానుభూతి పరులైన వారే కావడంతో కూటమి సర్కార్ ఇరుకున పడుతోంది అని అంటున్నారు. ఉచిత ఇసుక అని ప్రభుత్వం ప్రకటించినా అందులోనూ చాలా మంది వేళ్ళు పెడుతున్నారు. అది అత్యంత ఖరీదైన పదార్ధంగా మారిపోయింది. అదే విధంగా భూ దందాలు కూడా యధేచ్చగా చాలా చోట్ల జరుగుతున్నాయని అంటున్నారు.

ఇక లిక్కర్ షాపుల వ్యవహారంలోనూ అన్నీ తామే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. దీంతో ఎల్లో మీడియా ఈ తరహా దందా రాయుళ్లను అందరికీ కలిపి ఒక్ లిస్ట్ తయారు చేసి మరీ ఎల్లో బుక్కులో రాస్తోందిట. దీనిని అధినాయకత్వానికి పంపిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటారో కానీ ఇపుడు రెడ్ బుక్ కంటే ఎల్లో బుక్ హాట్ టాపిక్ గా మారింది. ఇది అధికారంలో ఉన్న వారినే టార్గెట్ చేస్తూ హడలెత్తిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఎల్లో బుక్ లో ఎవరి పేర్లు ఉన్న్నాయో ఎవరి మీద హై కమాండ్ సీరియస్ అవుతుందో అన్నది.

Tags:    

Similar News