"చెక్ యువర్ ఆరెంజ్".. యూవీ 'బ్రెస్ట్ క్యాన్సర్' ప్రోగ్రాంపై ఫైర్!

తాజాగా యువరాజ్ సింగ్ లాభాపేక్షలేని సంస్థ "యూ వియ్ కెన్" బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ప్రకటన పరిస్థితి ఇప్పుడు అలానే ఉందని అంటున్నారు.

Update: 2024-10-25 07:30 GMT

బహుమతే కాదు దాన్ని అందించే విధానం కూడా బాగుండాలని అంతారు. అంటే.. చేసేది మంచి పనే అయినా.. చేసే విధానం సరిగ్గా లేకపోతే విమర్శలు తప్పవు అన్నమాట. తాజాగా యువరాజ్ సింగ్ లాభాపేక్షలేని సంస్థ "యూ వియ్ కెన్" బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ప్రకటన పరిస్థితి ఇప్పుడు అలానే ఉందని అంటున్నారు.


అవును... టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నాన్ ఫ్రాఫిట్ ఆర్గనైజేషన్ "యూ వియ్ కెన్" బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో బ్రెస్ట్ ను "ఆరెంజ్" అని పేర్కొన్నారు. "మీ నారింజను నెలకోసారి చెక్ చేసుకోండి" అనే నినాదంతో ఈ ప్రకటన ఉంది. దీంతో నెటిజన్లు ఫైరవుతున్నారు.

ఏఐతో రూపొందించిన ఈప్రకటనలో ఓ యువతి బస్సులో నిలబడి ఉండగా.. చుట్టూ వృద్ధ మహిళలు కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో యువతి రెండు ఆరెంజ్ పండ్లను పట్టుకొని ఉంది. ఇక్కడ.. "చెక్ యువర్ ఆరెంజెస్ వన్స్ ఏ మంత్" అని స్లోగన్ రాసి ఉంది! దీనిపై నెటిజన్లు ఫైరవుతున్నారు. కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

ఇందులో భాగంగా.. సున్నితమైన విషయాలలో ఎలా స్పందించలి, ఆరోగ్య సమస్యలపై ఎలా అవగాహన కల్పించాలి అనే విషయంలో కొందరికి కనీస స్పృహ లేకుండా పొతోంది.. ఢిల్లీ మెట్రోలో "మీ నారింజను నెలకోసారి చెక్ చేసుకోండి" పోస్టర్ చూసిన తర్వాత నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూశాను అంటూ ఒకరు కామెంట్ చేశారు.

ఇదే క్రమంలో... అసలు ఈ పోస్టర్లను ఎవరు చేస్తారు.. వీటిని ఎవరు ఆమోదిస్తారు..? అని ప్రశ్నిస్తూ... ఈ పోస్టర్ ను పబ్లిక్ లోకి తీసుకురాగలిగేటంత మూర్ఖులు మనల్ని పరిపాలిస్తున్నారా? అంటూ ఓ మహిళ మరింత స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.

అదేవిధంగా... "ఇది క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యాంపెయిన్ అని తెలుసుకున్నాను.. వీరి ఉద్దేశ్యం సరైనదే కావొచ్చు కానీ.. ఇది నిజంగా అసహ్యకరమైనది అనే చెప్పాలి. ఈ ప్రచారాన్ని వెంటనే నిలిపి వేయాలని కోరుకుంటున్నాను" అంటూ మరొకరు స్పందించారు.

"బ్రెస్ట్ అని కూడా మనం పిలవలేకపోతే.. ఒక దేశం బ్రెస్ట్ క్యాన్సర్ అవెర్నెస్ ఎలా పెంచుతోంది?" అని ఇంకొకరు ప్రశ్నించారు.

Tags:    

Similar News