యూట్యూబ్ క్రియేటర్లకు అలర్ట్... యూజర్స్ చేతిలో కీలక పవర్!
అవును... ఇటీవల కాలంలో ఏది ఒరిజినల్ వీడియో, ఏది ఏఐ ఆధారిత వీడియో అనేది తెలుసుకోవడం క్లిష్టతరంగా మారిన నేపథ్యంలో... యూట్యూబ్ సరికొత్త గైడ్ లైన్స్ ని తెరపైకి తెచ్చింది.
ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తున్న నేపథ్యంలో... యూట్యూబ్ లో దర్శనమిచ్చే వీడియోల్లో ఏది ఒరిజినల్ వీడియో, మరేది ఏఐ ఆధారిత వీడియో అనేది తెలుసుకోవడం యూజర్స్ కి పెద్ద తలనొప్పిగా ఉంటుంది! ఈ సమయంలో... యూట్యూబ్ సరికొత్త గైడ్ లైన్స్ ను ప్రకటించింది. ఈ సమయంలో క్రియేటర్లు అప్రమత్తంగా ఉండాలి!
అవును... ఇటీవల కాలంలో ఏది ఒరిజినల్ వీడియో, ఏది ఏఐ ఆధారిత వీడియో అనేది తెలుసుకోవడం క్లిష్టతరంగా మారిన నేపథ్యంలో... యూట్యూబ్ సరికొత్త గైడ్ లైన్స్ ని తెరపైకి తెచ్చింది. దీంతో... ఏఐ ఆధారిక కంటెంట్ క్రియేషన్ విషయంలో యూట్యూబ్ క్రియేటర్లు అప్రమత్తంగా ఉండాలి. అలాకానిపక్షంలో కంటెంట్ డిలీట్ తో పాటు సస్పెన్షన్ పడే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో విడుదలైన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. క్రియేటర్లు పబ్లిష్ చేసే వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించారో లేదా మార్చారో వెల్లడించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో... ప్రైవసీ అభ్యర్థన ప్రక్రియ ద్వారా క్రియేట్ చేసిన నిర్దిష్ట ఏఐ కంటెంట్ ను తొలగించమని రిక్వస్ట్ చేయడానికి వీక్షకులకు ఆప్షన్ కూడా అందిస్తుంది.
ఇదే క్రమంలో ఏఐ తో రూపొందించిన కంటెంట్ కు క్రియేటర్లు స్పష్టంగా లేబుల్ వేయాలి.. ఈ మేరకు యూట్యూబ్ లేబుల్ లను అందిస్తుంది. కంటెంట్ ఏఐ గా క్రియేట్ చేయదం లేదా మార్ఫింగ్ చేసినట్లు సూచిస్తుంది. ఏఐ ఆధారిత వీడియోల ద్వారా వీక్షకులు తప్పుదారి పట్టకుండా నిరోధించడానికి ఈ గైడ్ లైన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది!
ఈ విధానంతో యూట్యూబ్ కంటెంట్ సమగ్రతతో పాటు వీక్షకులను ప్రైవసీ మరింతగా సంరక్షించబడుటంలో సాయపడుతుంది. ఇదే సమయంలో... ఏఐతో రూపొందించిన లేదా మార్ఫింగ్ చేసిన కంటెంట్ ను తొలగించమని రిక్వస్ట్ చేయడానికి యూజర్లకు అధికారం ఇవ్వబడుతుంది. ఈ కొత్త నిబంధనలు అతిక్రమించిన క్రియేటర్ల కంటెంట్ డిలీట్ చేయబడుతుంది.
కొన్ని సందర్భాల్లో తీవ్రతను బట్టి సస్పెన్షన్ కు గురయ్యే అవకాశం ఉంది. ఈ ఫిర్యాదు అనంతరం యూట్యూబ్ లో కంటెంట్ అప్ లోడ్ చేసినవారికి వాటిని తొలగించడానికి 48 గంటలు ఇవ్వవచ్చు. ఈ సమయంలో తమ యూట్యూబ్ స్టూడియోలో ఉన్న ట్రిం లేదా బ్లర్ టూల్స్ ని సదరు క్రియేటర్ ఉపయోగించవచ్చు. ఈ కొత్త మార్గదర్శకాలు నెల రోజుల్లో అమలులోకి రానున్నాయి!!