బాబు జైలులో...జగన్ జనంలోకి....!
ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కించేలా పవర్ ఫుల్ డెసిషన్స్ తో వైసీపీ రానున్న కాలంలో దూకుడు చేయబోతోంది అని అంటున్నారు
ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కించేలా పవర్ ఫుల్ డెసిషన్స్ తో వైసీపీ రానున్న కాలంలో దూకుడు చేయబోతోంది అని అంటున్నారు. ఏపీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం రాత్రికి చేరుకోనున్నారు. ఈ నెల 2న లండన్ కి జగన్ వెళ్లారు. ఆయన తన కుమార్తెలను చూసేందుకు లండన్ కి పది రోజుల పర్యటన నిమిత్తం వెళ్లారు. జగన్ లండన్ కి వెళ్లినా ఏపీ రాజకీయం మొత్తం ఆయన చుట్టూనే సాగింది.
ఇక ఇటీవల మూడు రోజులలో అనేక సంచలన పరిణామాలు జరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబుని నంద్యాలలో అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి జైలుకు రిమాండ్ ఖైదీగా పంపించడంతో ఏపీలో టీడీపీ మండిపోతోంది. ఆ పార్టీని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఏపీలో ఒక విధంగా అప్రకటిత కర్ఫ్యూ వాతవరణం ఉన్న వేళలో జగన్ లండన్ నుంచి అమరావతి రానున్నారు.
జగన్ లండన్ లో ఉన్నా ఆయన మీద దారుణమైన విమర్శలతో విరుచుకునిపడిన విపక్షం ఇపుడు ఆయన ఏకంగా తాడేపల్లిలోని తన నివాసంలో కొలువు తీరే వేళ ఇక ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. మరో వైపు చూస్తే జగన్ వచ్చిన తరువాత ఏపీ రాజకీయం మరింత వేడి వాడిగా సాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
జగన్ సైతం బాబు అరెస్ట్ ని టచ్ చేయకుండా తన పాలన అభివృద్ధి సంక్షేమం వంటి యాక్టివిటీ మీదనే దృష్టి సారించనున్నారు అని అంటున్నారు. చట్టం తన పని తాను చేస్తోంది అని చెప్పడానికే జగన్ మార్క్ మౌనం బాబు మీద నో కామెంట్ అన్నట్లుగా వ్యవహరిస్తారు అని అంటున్నారు. ఇక జగన్ వచ్చీ రావడంతోనే మంత్రి వర్గ సమావేశాలను నిర్వహిస్తారని అంటున్నారు. ఈ మంత్రివర్గ సమావేశాలలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు.
ఇక 2024 ఎన్నికల కోసం వైసీపీ ప్రిపేర్ అవుతోంది. దానికి తగిన రోడ్ మ్యాప్ తో పార్టీని ప్రభుత్వాన్ని రెడీ చేసే దిశగా జగన్ మార్క్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది అని అంటున్నారు. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు దాదాపుగా పది రోజుల పాటు జరుగుతాయని అంటున్నారు. ఆ సమావేశాల తరువాత జగన్ నేరుగా జనం వద్దకే వెళ్తారని అంటున్నారు.
తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి జనంలోనే ఉంటూ చాటి చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల్లో పాజిటివ్ ఓటుతోనే మరోసారి అధికారంలోకి రావాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు.
అదే విధంగా పార్టీని ప్రభుత్వాన్ని కూడా ఆ దిశగా జగన్ సమాయాత్తం చేస్తారని అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో వర్క్ షాప్స్ ని నిర్వహిస్తారని అలాగే పనితీరు లో వెనకబడిన వారికి కూడా దిశా నిర్దేశం చేసి ముందుకు నడిపిస్తారు అని అంటున్నారు.
మొత్తం మీద చూసుకుంటే జగన్ ఇక పాలనాపరంగా అలాగే రాజకీయంగా పట్టు బిగిస్తారు అని అంటున్నారు. వైసీపీ సైన్యం మొత్తాన్ని పూర్తి స్థాయిలో జనంలోకి దించడం తాను కూడా నిరంతరం జనంలో ఉండేలా చూసుకుంటారు అని అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ డీలా పడిపోయింది.
ఒక విధంగా ఆ పార్టీలో అయోమయం ఏర్పడింది. దాంతో ఈ కీలక సమయంలోనే జనంలో ఉంటూ వైసీపీని ప్రజలకు మరింతనా కనెక్ట్ చేయడం ద్వారా 2024 ఎన్నికల్లో మరోసారి గెలవాలని జగన్ భావిస్తున్నారుట. సో రాజమండ్రి జైలులో చంద్రబాబు ఉంటున్న వేళ జగన్ అమరావతికి వస్తున్నారు. చూడాలి మరి జగన్ రాకతో అధికార పార్టీ రాజకీయం మరే కొత్త మలుపు తీసుకుంటుందో.