లక్షల కోట్ల భక్షక, అవినీతి అర్భక... వేటగాడు సినిమా గుర్తు చేసిన బాలయ్య!
ప్రస్తుతం చంద్రబాబు జైలులో ఉండటం.. చినబాబు లోకేష్ జైలు బయట కార్ వ్యాన్ లో ఉండటంతో టీడీపీ శ్రేణుల్లో పార్టీ బాధ్యతలపై ఆందోళన నెలకొందని అంటున్నారు
ప్రస్తుతం చంద్రబాబు జైలులో ఉండటం.. చినబాబు లోకేష్ జైలు బయట కార్ వ్యాన్ లో ఉండటంతో టీడీపీ శ్రేణుల్లో పార్టీ బాధ్యతలపై ఆందోళన నెలకొందని అంటున్నారు. ఈ సమయంలో ఆ ఆందోళనలకు ఏమాత్రం అవకాశం లేకుండా నందమూరి బాలకృష్ణ లైన్ లోకి వచ్చారు. ఈ సందర్హంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో తనదైన యతిప్రాసలతో విమర్శలు గుప్పించారు.
అవును... "వేటగాడు" సినిమాలో రావుగోపాల్ రావు, తన కుమారుడైన కైకాల సత్యాన్నారయణను యతిప్రాసలతో విమర్శలు కలగలిపిన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తారు. అర్ధరాత్రి అవుతున్నా కూడా తన మరదలు ఇంటికి రాలేని విషయంపై కైకాల సత్యన్నారాయణ.. ఇదేమి పద్దతి అని అడిగితే... పద్దతుల గురించి తమరు మాట్లాడుతున్నారా అంటూ రావు గోపాల్ రావు ఒక ప్రాస వదులుతారు.
ఇందులో భాగంగా... చిన్నప్పుడు బల్లెగ్గొట్టి, గుర్రబ్బల్లెక్కి, జీల్లు ఇంకా కుల్లు తిల్లూ తింటు, పిచ్చుక గూళ్లు కట్టుకుంటూ, గుళ్లూ గోపురాలు అంటూ తిరిగి అర్ధరాత్రి ఇంటికిచేరే నువ్వు.. రోజా తిరుగుల్ల గురించి మాట్లాడతావా.. అసుయాంధకారా అంటూ రావు గోపారావు ప్రశ్నిస్తారు.
ఈ క్రమంలో అంతకు మించి అన్నట్లుగా... స్పందించారు బాలయ్య. తాజాగా విజయవాడలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో కలిసి బాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా యతిప్రాసలతో బాలయ్య వదిలిన విమర్శల తూటాలు వైరల్ అవుతున్నాయి.
''లక్షల కోట్ల భక్షక, అవినీతి అర్భక, పక్షపథ రూపక, ముఖ్య కంత్రీ మహా మూర్ఖా, మూచీ ముద నష్టకా, జగమెరిగిన జగన్నాటక, ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక, రాష్ట్రానికి రావణ పాలక, జన ధన మన చోరక.. మన ముఖ్యమంత్రి'' అంటూ బాలయ్య బాబు కామెంట్ చేశారు. దీంతో పైన చెప్పుకున్నట్లు ''వేటగాడు'' సినిమాలో రావుగోపాల్ రావు ప్రాసలతో పోలుస్తూ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్, మీమర్స్, ట్రోలర్స్!
కాగా... ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దానికితోడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కు సంబంధించిన కేసులు కూడా మొదలవుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో బాలయ్య రంగంలోకి దిగారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఏసీబీ వద్ద ఉన్నాయని చెబుతున్న పక్కా ఆధారాల నడుమ చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారనే విషయంలో కాస్త సందిగ్ధత నెలకొందని అంటున్న తరుణంలో... పార్టీ బాధ్యతలు చేపట్టే పనికి పూనుకున్నట్లున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ సమయంలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ, వైఎస్ జగన్ పై ఈ స్థాయిలో కామెంట్స్ చేశారు.