వైసీపీ అభ్యర్ధులు రెడీనా...అంతా వారేనా..?
జగన్ గత కొద్ది రోజులుగా పార్టీ అభ్యర్ధుల విషయం మీదనే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు అని అంటున్నారు
జగన్ గత కొద్ది రోజులుగా పార్టీ అభ్యర్ధుల విషయం మీదనే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు అని అంటున్నారు. సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించి జనంలోకి పంపించాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఒక్కో జిల్లాలో వైసీపీ అభ్యర్ధులను సెలెక్ట్ చేసే ప్రక్రియ సాగుతోందని, జాబితా ఫైనల్ దశకు చేరుకుందని అంటున్నారు.
ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో మూడు నాలుగు సీట్లు తప్ప అన్నీ సెలెక్ట్ చేశారని అంటున్నారు. గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, విజయవాడ ఈస్ట్ నుంచి దేవినేని అవినాష్, వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నుంచి మల్లది విష్ణు పేర్లు ఖరారు అయ్యాయని అంటున్నరు. అలాగే నందిగామ నుంచి మేకతోటి జగన్మోహన్ రావు, మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు క్రిష్ణ మూర్తి పోటీ చేస్తారు అని తెలుస్తోంది.
గుంటూరు జిల్లా తీసుకుంటే సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు, పల్నాడు నుంచి పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, గురజాల నుంచి కాసు మహేష్ పోటీ చేస్తారు అని తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సీటు అయిన తాడేపల్లి నుంచి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ని దింపుతారు అని అంటున్నారు. ప్రత్తిపాడు నుంచి మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ప్లేస్ లో ఆమె భర్తను పోటీ చేయిస్తారు అని అంటున్నారు.
విశాఖ జిల్లా తీసుకుంటే విశాఖ సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ కుమారు, నార్త్ నుంచి కేకే రాజు, తూర్పు నుంచి ఎంవీవీ సత్యనారాయణ, వెస్ట్ నుంచి ఆడారి ఆనంద్ కుమార్ పోటీ చేస్తారు అని తెలుస్తోంది. భీమిలీ నుంచి అవంతి శ్రీనివాస్, గాజువాక నుంచి తిప్పల దేవాన్ రెడ్డి, పెందుర్తి నుంచి అదీప్ రాజ్, అనకాపల్లి నుంచి గుడివాడ అమరనాధ్, ఎలమంచిలి నుంచి కన్నబాబురాజు, మాడుగుల నుంచి బూడి ముత్యాలనాయుడు, నర్శీపట్నం నుంచి పెట్ల ఉమా శంకర్, చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ పేర్లు కన్ ఫర్మ్ అంటున్నారు. ఏజెన్సీలో అరకు నుంచి శెట్టి ఫల్గుణ ఖరారు అయింది అని అంటున్నారు.
అలాగే విజయనగరం తీసుకుంటే చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, సాలూరు నుంచి పీడిక రాజన్నదొర, కురుపాం నుంచి పుష్ప శ్రీవాణి, పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు, నెల్లిమర్ల నుంచి కడుబండి శ్రీనివాసరావు, గజపతినగరం నుంచి బొత్స అప్పలనరసయ్య పోటీ చేస్తారని అంటున్నారు. మిగిలిన సీట్లు చూడాల్సి ఉంది.
శ్రీకాకుళం తీసుకుంటే శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, పలాస నుంచి సీదరి అప్పలరాజు, ఇచ్చాపురం నుంచి పిరియా విజయ, పాలకొండ నుంచి విశ్వసరాయి కళావతి, రాజాం నుంచి కంబాల జోగులు కన్ ఫర్మ్ అంటున్నారు. మిగిలినవి ఖరారు చేయాల్సి ఉంది అని అంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఒకరిద్దరు తప్ప టోటల్ గా మార్చే సీన్ ఉండదని అంటున్నారు. ప్రకాశం నెల్లూరు జిల్లాలలో ఒకరిద్దరు అటూ ఇటూ అవుతారని అంటున్నారు.
ఏదైనా మార్పు చేర్పులు ఉంటే గోదావరి జిల్లాల మీదనే ఫోకస్ పెట్టి అక్కడ గట్టిగానే కసరత్తు చేస్తారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే దాదాపుగా సిట్టింగులకే టికెట్లు ఖరారు చేసేలాగానే వైసీపీ కసరత్తు సాగుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.