పవన్ని పట్టుకుని...వైసీపీ ఎంపీ ..!

Update: 2023-08-13 12:10 GMT

పవన్ కళ్యాణ్ జనసేన నేతగా మారిన తరువాత ఆయన మీద విమర్శలు వైసీపీ నుంచి ఘాటుగానే వస్తున్నాయి. ఆయన ఎవరి మీద విమర్శలు చేస్తే రివర్స్ లో అవి వచ్చి ఆయనకు గట్టిగానే తగులుకుంటున్నాయి. ఆ విధంగా చూస్తే గతంలో చాలా మంది చాలా రకాలుగా పవన్ని విమర్శించారు కానీ విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాత్రం చెడా మడా అనేశారు.

పవన్ని పట్టుకుని అసలు వ్యక్తిగా గుర్తించను, ఆయన మనిషే కారు అంటూ మాట్లాడిన మాటలు నిజంగా చూస్తే జనసైనికులకు గుచ్చుకునేవే. పవన్ విశాఖ పర్యటనలో భాగంగా ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఒక కట్టడం వద్దకు వెళ్ళి అక్కడ అంతా అక్రమం అంటూ మాట్లాడారు, అవినీతి అక్రమాలు ఎంపీ చేస్తున్నారు అని నిందించారు ఎంపీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపో అని హెచ్చరించారు.

మరి ఎంపీ ఊరుకుంటారా. తన ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ మీద అనాల్సినవి అన్నీ అనేశారు. సినిమాల్లో గంతులేసుకునే పవన్ కి రాజకీయాలు ఎందుకు అని నిలదీశారు. అసలు నిన్ను ఎవరు రాజకీయాల్లోకి రమ్మన్నారు అని ప్రశ్నించారు. నిన్ను నాయకుడిగా ఎవరు భావిస్తారు అని కూడా కడిగేశారు.

నీకు వ్యక్తిత్వమే లేదు, నీవు మరొకరిని అనడమా అని పవన్ని పట్టుకుని గట్టిగానే వేసుకున్నారు. నీ వల్ల నిర్మాతలు నష్టపోయి బాధలు పడుతూంటే పట్టించుకోవు, నీ పార్టీని నడపలేక చంద్రబాబు పంచన చేరిన మనిషివి, ఎక్కడ పోటీ చేస్తావో ఎన్ని సీట్లకు చేస్తావో కూడా ఒక లెక్క లేని వాడివి మమ్మల్ని అంటావేంటి అని గద్దించారు. చంద్రబాబు ఇచ్చే పాతిక ముప్పయి ఎమ్మెల్యే సీట్ల కోసం పార్టీని తాకట్టు పెట్టేసిన పవన్ మాకు సుద్దులు చెబుతారా అని ఎంపీ మండిపడ్డారు.

ఏపీలో అధికారంలోకి ఎవరు వస్తారు, చంద్రబాబా, లోకేషా లేక పవన్ కళ్యాణా ఎవరు సీఎం అన్నది చెప్పాలని ఎంవీవీ డిమాండ్ చేశారు. నీ పార్టీ అజెండా ఏంటో చెప్పు అని నిగ్గదీశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పధకలాను కంటిన్యూ చేస్తావా లేదా చెప్పాలని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను తిడుతున్న పవన్ అది కంటిన్యూ చేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

వూరికే వారాహి రధమెక్కి వైసీపీని జగన్ని తిట్టడమే పనిగా పెట్ట్యుకుంటే రాజకీయం అయిపోదని పవన్ కి హితవు పలికారు. తాను పాతికేళ్ళుగా నిజాయతీగా నిర్మాణ రంగంలో బిజినెస్ చేస్తున్నాను అని ఆయన చెప్పుకున్నరు. తన వల్ల ఎంతో మందికి ఉపాధి దొరుకుతోందని అన్నారు. విశాఖ అభివృద్ధిలో తన పాత్ర కూడా ఉందని అన్నారు. సొంతంగా ఎదిగి తాను ఈ రోజున ఎంపీగా నెగ్గానని చెప్పారు.

అలాంటిది రెండు చోట్లో ఓడిన పవన్ తనను రాజీనామా అడగడం ఏంటని ఆయన ఫైర్ అయ్యారు విశాఖలో ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుని మోసం చేసిన పవన్ వెన్నుపోటుతోనే విశాఖలో తన జీవితాన్ని మొదలెట్టారని ఎంవీవీ మండిపడ్డారు. ఆయన మీద 2008లో విశాఖ కోర్టులో కేసు పడలేదా అని ప్రశ్నించారు. విశాఖ సహా ఏపీలో సొంత ఇల్లు లేని పవన్ ఏపీని ఉద్ధరిస్తాను అని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.

లింగమనేని నుంచి కారు చౌఉకగా మంగళగిరి వద్ద యాభై కోట్ల విలువ చేసే భూమిని కోటికే తీసుకున్న పవన్ క్విడ్ ప్రోకోకి పాల్పడలెదా, దాన్ని ప్యాకేజి అనరా అని ఎంవీవీ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం అంత దారుణమైన జీవితం వేరే ఎవరికీ ఉండదని ఎంవీవీ అన్నారు.

అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అని ఎంవీవీ అన్నారు. అయితే తనను పవన్ కళ్యాణ్ విమర్శించారు కాబట్టే మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. కరోనా టైం లో హైదరాబాద్ లో ఉంటూ విలాసవంతంగా గడిపిన పవన్ తాపీగా ఏపీకి వచ్చి ప్రజలకు మేలు చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ని చదువుతూ అదే రాజకీయం అనుకుంటున్నారని మండిపడ్డారు.

తన మీద సత్తా ఉంటే పవన్ 2024 లో జరిగే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాలు అంటే అవతల వారిని విమర్శించడం కాదని తమ విధానాలను ప్రజలకు చెప్పి ఒప్పించుకోవడం అని ఎంపీ అంటున్నారు. పవన్ కి చేతనైతే టీడీపీ సపోర్ట్ తో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించుకోవాలని ఎంవీవీ సవాల్ చేశారు. మొత్తానికి ఎన్నడూ పెద్దగా మాట్లాడని విశాఖ ఎంపీ పవన్ విషయంలో మాత్రం ఘాటుగానే రిప్లై ఇవ్వడం అది కూడా ఎవరూ అనని విధంగా పవన్ మీద తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశం అయింది.

Tags:    

Similar News