ఢిల్లీలో ధర్నా సమయంలో వైసీపీ కీలక నిర్ణయం!
అవును... ఏపీలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జగన్ నేడు ఢిల్లీకి చేరుకున్నారు.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వైసీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని.. నడి రోడ్డుపై హత్యలు వెలుగు చూస్తున్నాయని విమర్శిస్తూ... వైసీపీ అధినేత జగన్ ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. అక్కడ ఫోటో / వీడియో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
అవును... ఏపీలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జగన్ నేడు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన వెంట మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానితో పాటు పలువురు నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో హస్తిన వేదికగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు వైసీపీ నిర్ణయించింది!
ఇందులో భాగంగా... ఢిల్లీలో 24న జరిగే ధర్నాలో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచీ జరుగుతున్న హింసకు సంబంధించిన ఫోటో గ్యాలరీ, వీడియోలను ప్రదర్శించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ ఎగ్జిబిషన్ కు మీడియా అంతటినీ ఆహ్వానిస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను హైలెట్ చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని పేర్కొంది.
ఇక నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్... మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ల అపాయింట్మెంట్స్ ని జగన్ కోరారు. రాష్ట్రంలో సుమారు గత 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై వీరిని కలిసి వివరించి, ఫిర్యాదు చేయనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రపతి పాలన డిమాండ్ ను వినిపించనున్నారు.
ఇదే సమయంలో... పలు జాతీయ పార్టీల నేతలను కూడా జగన్ కలిసి ఏపీలో పరిస్థితిని వివరించనున్నారని అంటున్నారు. అయితే.. ఆ జాతీయ పార్టీలు ఎన్డీయే కూటమిలోవా, ఇండియా కూటమికి చెందినవా అనేది తెలియాల్సి ఉంది. ఇలా కలిసిన అనంతరం వారిని కూడా ధర్నాకు హాజరుకావాలని ఆహ్వానించనున్నారని సమాచారం.