రెడీ టు గో... వైసీపీ తుది జాబితాకు వేళాయెరా!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ, జగన్ జనాల్లోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమవుతున్న వేళ అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చివరిదశకు వచ్చాయని తెలుస్తుంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ, జగన్ జనాల్లోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమవుతున్న వేళ అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చివరిదశకు వచ్చాయని తెలుస్తుంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన అధిష్టాణం... ఐదో జాబితాతోపాటు తుది జాబితాపైనా కన్ క్లూజన్ కి రాబోతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా తాజాగా జగన్ పలువురు కీలక నేతలతో భేటీ అయ్యారు.
అవును... వైసీపీ అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేసిన అధిష్టాణం ఐదో జాబితాపై కసరత్తులు చేస్తుందని తెలుస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన స్థానలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో మార్పులు అవసరం ఉన్న చోట కొత్తగా అవకాశం దక్కేవారినీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలనూ పిలిచి మాట్లాడుతోంది.
వాస్తవానికి ఈ నెల 25 నుంచి రీజనల్ మీటింగ్స్ పేరున జగన్.. కేడర్ తో మీటింగ్స్ అరేంజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి సభ భీమిలిలో జరగనుందని ప్రకటించారు! ఇదే సమయంలో మిగిలిన నాలుగు రీజియన్ లలోనూ ఎప్పుడెప్పుడు సభలు ఉండేది త్వరలో వెల్లడించనున్నారు. దీంతో... 25లోపు ఈ జాబితాపై ఒక క్లారిటీ రావొచ్చని అంటున్నారు.
కాగా... గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా వైసీపీ అధినేత జగన్... చాలా నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. సర్వేల ఫలితాలు, సామాజిక సమీకరణాలు, కార్యకర్తల సూచనలను ప్రాతిపదికగా తీసుకుని ఆయన ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుసుంది. వైనాట్ 175 లక్ష్యం అని నిర్ధేశించుకున్న తర్వాత ఏ చిన్న విషయాన్ని జగన్ లైట్ తీసుకోవడం లేదని తెలుస్తుంది.
ఇక... ఇప్పటివరకూ విడుదలైన తొలి నాలుగు జాబితాలతోనూ మొత్తం 10 పార్లమెంట్, 58 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... మొదటి జాబితాలో 11 అసెంబ్లీ.. రెండో జాబితాలో 24 అసెంబ్లీ - 3 పార్లమెంట్.. మూడో జాబితాలో 15 అసెంబ్లీ - 6 పార్లమెంట్.. నాలుగో జాబితాలో 8 అసెంబ్లీ - 1 పార్లమెంట్ సెగ్మెంట్ లలో అభ్యర్థులను అధిష్టాణం ఖరారు చేసింది.