ఢిల్లీలో జీరో విజిబిలిటీ... రానున్న 10 రోజుల్లో పరిస్థితిపై కీలక అప్ డేట్!
అవును... దేశరాజధాని ఢిల్లీని అత్యంత దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో.. సమీపంలోని దృశ్యాలు కనిపించని పరిస్థితి నెలకొంది.
శీతాకాలం సమీపించిందంటే దేశ రాజధానితో సహా పలు ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రధానంగా రోజు రోజుకీ పెరిగిపోతోన్న వాయుకాలుష్యం దెబ్బకు ఈ పరిస్థితి తీవ్రంగా మారుతుందని అంటున్నారు. ఈ సమయంలో... ప్రస్తుతం ఢిల్లీ - ఎన్.సీ.ఆర్.లో ప్రజలు వరుస ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇందులో భాగంగా... ఒకవైపు చలికాలం ప్రారంభమైన వెంటనే దట్టమైన పొగమంచు కమ్ముకొవడంతో సమీపంలోని దృశ్యాలు కూడా కనిపించని (జీరో విజిబిలిటీ) పరిస్థితి నెలకొంది. మరోపక్క వాయు కాలుష్య సమస్య తీవ్రంగా మారుతోంది. ఫలితంగా.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) దారుణమైన స్థాయిలో పడిపోతుందని అంటున్నారు.
అవును... దేశరాజధాని ఢిల్లీని అత్యంత దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో.. సమీపంలోని దృశ్యాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో... ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రన్ వేపై సరిగా కనిపించని కారణంగా పలు విమానాల రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. ఇందులో భాగంగా... పలు విమానాలను దారి మళ్లించినట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా రానున్న పది రోజుల్లో ఢిల్లీ ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండవని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో పొగమంచు, గాలి నాణ్యత సూచిక చాలా దారుణంగా మారుతోందని చెబుతునారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో... ఢిల్లీ వాసులు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.
గురువారం నాటి పరిస్థితులను గమనిస్తే... ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 432గా సూచిస్తోంది. ఇది ప్రమాదకరమైన విభగంలోకే వస్తుంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో ఏకంగా 450 కంటే ఏక్యూఐ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. అత్యధికంగా ఆనంద్ విహార్ లో 473, అశోక్ విహార్ లో 471గా నమోదైందని అంటున్నారు.
ఈ విధంగా నానాటికీ క్షీణిస్తున్న వాయు నాణ్యతను దృష్టిలో ఉంచుకుని ఐదో తరగతి వరకూ స్కూల్స్ మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని భారతీయ జనతాపార్టీ డిమాండ్ చేసింది.