సహజీవనం చేస్తున్న మహిళకు ఆస్తి పై హక్కు... రూల్స్ ఇవే!
దీంతో... లివ్-ఇన్ రిలేషన్స్ లో భాగస్వాములకు పుట్టిన పిల్లలను చట్టబద్ధ వారసులుగా పరిగణించవచ్చని సుప్రీం తీర్పు చెప్పిందని అంటున్నారట ఆరాధనా భన్సాలీ!
ఒక వ్యక్తితో లివిన్ రిలేషన్ షిప్ లో ఉన్న మహిళకు సదరు వ్యక్తి ఆస్తిలో హక్కు ఉంటుందా? లివ్ ఇన్ రిలేషన్ అనేది అనధికారిక బంధం అయితే.. ఆ హక్కు ఎలా ఉంటుంది? ఒకవేళ ఆ హక్కు ఉంటే అందుకున్న రూల్స్ ఏమిటి? అనేవి ఇప్పుడు చూద్దాం...!
సాధారణంగా ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తులు వారి తదనంతరం వారసులకు లేదా రక్తసంబంధీకులకు చెందుతాయి. మరికొన్ని సందర్భాల్లో తమ తదనంతరం ఆస్తుల పంపిణీ ఎలా జరగాలి అనేది వీలునామా రాస్తారు. ఇది లీగల్ డాక్యుమెంట్. అయితే అయితే సహజీవనం చేస్తున్న మహిళకు సైతం ఆస్తిలో వాటా డిమాండ్ చేయవచ్చని అంటున్నారట న్యాయనిపుణులు!
అవును... లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న మహిళ తన పార్ట్నర్ ఆస్తిలో హక్కును కలిగి ఉంటారని.. అందుకు సంబంధించిన కీలక విషయాలను రజనీ అసోసియేట్స్ ప్రతినిధి ఆరాధనా భన్సాలీ చెప్పారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన రూల్స్ ఎలా ఉన్నాయనే వివరాలు అమె తెలిపారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా.. గతంలో సుప్రీం కోర్టుల్లో చర్చకు వచ్చిన విషయాలను ఉదహరిస్తున్నారని అంటున్నారు. ఉదాహరణకు ఇటీవల ఇద్దరు పిల్లల తండ్రి చనిపోగా.. 15 ఏళ్ల క్రితమే తల్లి కూడా కన్నుమూసింది. దీంతో తండ్రి ఆస్తులను ఇద్దరు పిల్లల మీద రాశారు. అయితే మరణానికి ముందు ఆ తండ్రి ఓ మహిళతో సహజీవనం చేసేవారట. దీంతో ఆమె ఇప్పుడు ఆస్తుల్లో వాటా కోరుతోందట.
ఈ విషయం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కిందంట. దీంతో... లివ్-ఇన్ రిలేషన్స్ లో భాగస్వాములకు పుట్టిన పిల్లలను చట్టబద్ధ వారసులుగా పరిగణించవచ్చని సుప్రీం తీర్పు చెప్పిందని అంటున్నారట ఆరాధనా భన్సాలీ! అయితే దీనికి సంబంధించి అధికారిక చట్టం మాత్రం లేదని స్పష్టం చేస్తున్నారంట.
ఇలా అధికారిక చట్టం లేకపోవడంతో... లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న మేల్ పార్ట్ నర్ కి చెందిన ఆస్తుల్లో ఫీమేల్ పార్ట్ నర్ కి ఉన్న హక్కుల వ్యవహారం ఇప్పటికీ అస్పష్టంగా ఉందని చెబుతున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో వీలైనన్ని సాక్ష్యాదారాలతో పాటు... వీలైతే వీలినామాలో తన పేరు ప్రస్థావించేలా జాగ్రత్తలు తీసుకుంటే... సమస్య తీవ్రత తగ్గుతుందని అంటున్నారంట.
ఇదే క్రమంలో మరో ఉదాహరణను తెరపైకి తెస్తున్నారట. ఇందులో... ఒక వ్యక్తి భార్య చనిపోయింది. అయితే ఆమె తన ఆస్తులను తన చెల్లికి, భర్తకు వదిలి మరణించిందంట. దీంతో వంశపారంపర్యంగా ఆస్తి పొందేవారు ఎవరూ లేరు కాబట్టి... భార్య చెల్లికి ఆస్తిలో వాటా ఉంటుందా? ఫారిన్ నేషనల్ అయిన ఆమెకు ఎలాంటి హక్కులు ఉంటాయనే సందేహం భర్తకు వచ్చిందంట.
దీంతో ఇలాంటి సందర్భాల్లో.. వ్యక్తి మరణానంతరం వారి ఆస్తి చట్టపరమైన వారసులకు చేరడానికి రెండు మార్గాలు ఉన్నాయని చెబుతున్నారంట ఈ నిపుణులు. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణించినప్పుడు.. వారసత్వ చట్టాలు అటోమెటిక్ గా వర్తిస్తాయని అంటున్నారు. అలా కాకుండా... వీలునామా రాసిన తర్వాత మరణిస్తే... దాని ప్రకారమే ఆస్తులు పంపిణీ అవుతాయని చెబుతున్నారు.
ఇదే క్రమంలో... భార్య వీలునామా రాసినట్లు భావిస్తే.. భార్య సోదరి విదేశీ పౌరురాలా? కాదా? అనే దానితో సంబంధం లేకుండా ఆస్తికి అర్హురాలు అవుతుందట.
అయితే భారతదేశంలో ఒక వ్యక్తి వీలునామా లేకుండా మరణించినప్పుడు, వారి ఆస్తి పంపిణీ హిందూ వారసత్వ చట్టం ద్వారా నిర్ణయిస్తారని చెబుతున్నారు. ఈ చట్టం ప్రకారం... వారసులను రెండు వర్గాలుగా క్లాస్ ఈ, క్లాస్ ఈఈ గా విభజిస్తారట.
మరణించిన వ్యక్తికి క్లాస్ ఈ వారసులు ఉంటే, క్లాస్ ఈఈ వారసులు ఆస్తిలో ఎలాంటి వాటాకు అర్హులు కారని అంటున్నారు. కారణం... భారతీయ వారసత్వ చట్టాలలో ప్రాధాన్య వారసుడు (ప్రిఫరెన్షియల్ హెయిర్) అనే పదం వివరించలేదని స్పష్టం చేస్తున్నారు.