ఇలా చేస్తే రెండు వారాల్లో స్లిమ్‌ అవుతారు

Update: 2015-07-05 16:27 GMT
స్థూలకాయం. ప్రస్తుతం ఇదో పెద్ద సమస్య. బరువు తగ్గించుకోవడానికి సర్జరీలకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న వారిని కూడా చూస్తున్నాం. కానీ కొన్ని డైట్‌ నియమాలు పాటించి.. కొంచెం ఎక్సర్‌సైజ్‌ చేస్తే సహజంగానే బరువు తగ్గొచ్చు. ఆ చిట్కాలేంటో చూద్దాం రండి.

! అన్నం తగ్గించి పండ్లు ఎక్కువగా తీసుకోండి. పుచ్చకాయ, పైనాపిల్‌, బేరి పండ్లు బరువు తగ్గించడానికి మంచి సాధనాలు.ఈ మూడు పండ్లలో నీటి శాతం ఎక్కువుంటుంది. అవి కడుపు నింపుతాయి. ఎక్కువ కేలరీలు ఇవ్వవు.

! పళ్ల రసాలు చేసుకోవాలనుకుంటే అందులో చక్కెర వేయవద్దు.

! నీటి సాయంతో కొవ్వును ఫ్లష్‌ చేయవచ్చు. బరువు తగ్గాలనుకున్నపుడు నీళ్లు బాగా తాగాలి.

! గ్రీన్‌టీ శరీరంలో కొవ్వును తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. చురుకుదనాన్ని కూడా పెంచుతుంది. జీవక్రియ బాగా పని చేయడానికి ఉపయోగపడుతుంది.

! సిట్రస్‌ పళ్లు బరువు తగ్గడానికి తోడ్పడతాయి. వీటిలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. అవి కొవ్వు కరిగించడానికి, జీవక్రియ వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయి.

! నిమ్మకాయ కూడా కొవ్వు తగ్గించడానికి సాయపడుతుంది. నిమ్మరసంలో తేనె కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది.

! పచ్చిగా తినడానికి వీలున్న కూరగాయల్ని అలాగే తినండి. క్యారెట్‌, బీట్‌రూట్‌తోపాటు వీలున్న కూరగాయల్ని పచ్చిగానే తినండి.

! పిస్తా, బాదం, ఎండు ద్రాక్ష శరీరానికి మంచి శక్తినిస్తాయి. ఆకలి తగ్గిస్తాయి. కానీ వీటిలో ఎక్కువ క్యాలరీలు ఉండవు. ఓట్‌మీల్‌ కూడా జోడిస్తే ఇంకా మంచిది.

! చేదు ఆహారాలు ఒంటిలో కొవ్వును తక్షణం తగ్గిస్తాయి. కాకరకాయ సహా చేదు పదార్థాలకు మీ డైట్‌లో తప్పక చోటివ్వండి.

! తాజాగా ఉండే మొలకల్ని సాయంత్రం పూట తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి కడుపు నింపి ఆకలి తగ్గిస్తాయి. మీ శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. వీటిలో ఎక్కువ కేలరీలు ఉండవు. జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చేస్తాయి.

! బరువు తగ్గాలనుకున్నపుడు పాల ఉత్పత్తుల్ని అవాయిడ్‌ చేయాల్సిన పని లేదు. అందులో కేలరీలు తక్కువగా ఉండే పనీర్‌, కాటేజ్‌ చీజ్‌, వెన్న తీసిన పాలు తీసుకోవచ్చు.

! ఆహారంలో ఫైబర్‌ డైట్‌ ఎక్కువుండేలా చూసుకోండి.

Tags:    

Similar News