కిక్కిచ్చే స్ట‌న్నింగ్ లుక్ లో మ‌ళ్లీరావే బ్యూటీ!

హాట్ బ్యూటీ ఆకాంక్ష సింగ్ టాలీవుడ్ కి సుప‌రిచిత‌మే. `మ‌ళ్లీరావే` సినిమాతో ప‌రిచ‌య‌మైన అమ్మ‌డు తొలి సినిమాతోనే మెప్పించింది.

Update: 2023-09-29 13:30 GMT

హాట్ బ్యూటీ ఆకాంక్ష సింగ్ టాలీవుడ్ కి సుప‌రిచిత‌మే. `మ‌ళ్లీరావే` సినిమాతో ప‌రిచ‌య‌మైన అమ్మ‌డు తొలి సినిమాతోనే మెప్పించింది. నేచుర‌ల్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకుంది. అమ్మ‌డి బ్యూటీ సినిమాకి అద‌న‌పు అస్సెట్ గా నిలిచింది. ఆ ట్యాలెంట్ తోనే కింగ్ నాగార్జున న‌టించిన `దేవ‌దాస్` లోనూ ఛాన్స్ అందుకుం ది. కానీ అమ్మ‌డి టాలీవుడ్ కెరీర్ మాత్రం ఆశించిన విధంగా సాగ‌లేదు. హీరోయిన్ గా కొన్నాళ్ల పాటు రాణిస్తుంది అన్న కొంద‌రి అంచ‌నాలు త‌ప్ప‌య్యాయి.

దీంతో బాలీవుడ్ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది. అక్క‌డా నాలుగైదు సినిమాలు చేసింది. చివ‌రిగా `ర‌న్ వే 34` లో న‌టించింది. కానీ ఆ సినిమా ఫ‌లితంలో మ‌రో అవ‌కాశానికి ఛాన్స్ ఇవ్వ‌లేదు. గ‌తేడాది నుంచి బ్యూటీ ఖాళీగానే ఉంటుంది. అవ‌కాశాల కోసం సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. కోలీవుడ్ లో నూ మెరిసింది. అక్క‌డా అదే ప‌రిస్థితి. న‌వ‌త‌రం నాయిక‌ల పోటీని త‌ట్టుకుని ఆకాంక్ష మార్కెట్ లో నిల‌బ‌డ లేక‌పోతుంది.

ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో మ‌రీ అంత యాక్టివ్ కాదు. కానీ నెట్టింట‌కి ఎక్కిందంటే అందాల దాడి మాత్రం త‌ప్ప‌దు. అందం..చందాల‌తో యువ‌త‌ని క‌వ్వించడంలో మాత్రం న‌వా నాయిక‌ల‌కు గ‌ట్టి పోటీనిస్తుంది. డిజైన‌ర్ దుస్తుల్లో ..చిట్టి పొట్టినిక్క‌ర్ల‌లో ఆక‌ట్టుకుంటుంది. ఆల్ట్రామోడ్ర‌న్ బ్యూటీగా ఫోక‌స్ అవ్వాల‌ని ట్రై చేస్తుంది. తాజాగా అమ్మ‌డి కొత్త ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇదిగో ఇక్క‌డిలా బ్లాక్ ప్రాక్ లో మోడ్ర‌న్ భామ‌గా కెమెరాకి ఫోజులిచ్చింది.

థై అందాల్ని ఎలివేట్ చేస్తూ త‌న‌దైన శైలి కిల్ల‌ర్ లుక్ లో ఆక‌ట్టుకుంటుంది. సొగ‌స‌రి హాట్ భంగిమ‌కి కుర్రాళ్లంతా లాక్ అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో అమ్మ‌డి లుక్ వైర‌ల్ అవుతుంది. ఈపిక్ పై అభిమానుల కామెంట్ల వ‌ర్షం మామూలుగా లేదు. బ్యూటీ సూప‌ర్ హాట్ ఫోజు..స్ట‌న్నింగ్ లుక్ అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు. ల‌వ్ సింబ‌ల్స్ తో ప్ర‌పోజ‌ల్ దాడి పీక్స్ లో జ‌రుగుతోంది. మ‌రి ఈ ర‌క‌మైన క్రెడిబిలిటీ అమ్మ‌డి కొత్త అవ‌కాశాల‌కు దారి తీస్తుందా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News