జనసేన స్టైల్ లో మెగాస్టార్ విషెస్..!

అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే టాలీవుడ్ లో ముందుగా చెప్పుకునేవారిలో మెగా బ్రదర్స్ ఉంటారు.

Update: 2023-09-02 13:25 GMT

అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే టాలీవుడ్ లో ముందుగా చెప్పుకునేవారిలో మెగా బ్రదర్స్ ఉంటారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్. వారు వారికి పెళ్లిళ్లు అయ్యి, వాళ్ల పిల్లలకు పెళ్లిళ్లు అవుతున్నా, ఇప్పటికీ కలిసే ఉంటారు. ముగ్గురూ ఒకేమాట మీద ఉంటారు. అన్న చిరంజీవి అడుగుజాడల్లో నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వీరు కూడా సొంతంగా అభిమానులు సంపాదించుకున్నారు. అయినప్పటికీ చిరంజీవి మాటలకు విలువ ఇస్తారు.

ఎవరైనా చిరుని ఒక్కమాట అన్నారంటే మిగిలిన ఇద్దరు బదులు చెప్పకుండా ఉండరు. పవన్ విషయంలోనూ అంతే, పవన్ పై విమర్శలు వస్తే, చిరు, నాగబాబు సమాధానం చెప్పితీరతారు. వారి అనుబంధం చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఈ అన్నదమ్ములు ఎప్పటికప్పుడు సందర్భం వచ్చిన ప్రతిసారీ తమపై తమకు ఉన్న ప్రేమ, అభిమానాలను ప్రదర్శిస్తూ ఉంటారు.

తాజాగా ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిరు విషెస్ చెప్పిన విధానం అభిమానులను ఫుల్ ఖుషీ చేసింది. తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి దిగిన పాత ఫోటోని చిరు షేర్ చేశారు. ఈ ఫోటో షేర్ చేసి, పవన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే, ఆ చెప్పే విధానం చాలా వినూత్నంగా ఉండటం విశేషం.


ప్రస్తుతం పవన్ సినిమాలతో పాటు, జనసేన పార్టీ పెట్టి, రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. తన తమ్ముడికి ఈ పార్టీ విషయంలో ఇద్దరు అన్నలు ఎప్పుడూ సపోర్టివ్ గానే ఉన్నారు. తాజాగా ఆ విషయం తెలియజేసేలా, జనసేన స్టైల్ లో చిరు విషెస్ చెప్పడం విశేషం. డియరెస్ట్ కళ్యాణ్ బాబు అని మొదలుపెట్టారు. తర్వాత ‘జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా, నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, ఉన్నత భావాలు , గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని, నా తమ్ముడైనందుకు గర్విస్తూ, నీకు జన్మదిన శుభాకాంక్షలు!’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక, చిరు షేర్ చేసిన ఫోటో పాతది అయినా చాలా బాగుంది. పవన్ కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో ఉన్న ఫోటోలా అనిపిస్తుంది. ఇక ఫ్యాన్స్ రియాక్షన్ అదిరిపోయింది. నీ పోస్టు కోసమే ఎదురుచూస్తున్నాం అని కొందరు కామెంట్ చేస్తుంటే, వచ్చే ఏడాది సీఎంగా పుట్టిరోజు జరుపుకోవాలని ఆశీర్వదించండి అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Tags:    

Similar News