'వార్' బ్యూటీ మ్యాడ్ ఫోటోషూట్
సినిమాలతో పాటు వాణీకపూర్ సోషల్ మీడియాల్లోను నిరంతరం అభిమానులకు టచ్ లో ఉంది. ఈ భామ లేటెస్ట్ బోల్డ్ ఫోటోషూట్లు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.
ఎన్టీఆర్ నటిస్తున్న `వార్ 2`లో హృతిక్ సరసన కియరా అద్వాణీ నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు `వార్`(2019) చిత్రంలో వాణీ కపూర్ అతడి సరసన నటించింది. హృతిక్ - వాణీ మధ్య రొమాన్స్ మరో లెవల్లో వర్కవుటైంది. కానీ సీక్వెల్ లో వాణీకి స్కోప్ లేదు. వార్ చిత్రంలో తన పాత్ర హత్యకు గురవుతుంది. వాణీ లైఫ్ ఎండ్ అయ్యాక హృతిక్ లైఫ్ లోకి కియరా ఎంటరవుతుందని అర్థం చేసుకోవచ్చు. నిజానికి వార్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక వాణీ కెరీర్ గ్రాఫ్ స్కైలోకి దూసుకెళ్లింది. ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు సంతకాలు చేయడమే గాక, కార్పొరెట్ బ్రాండ్స్ ప్రకటనల కోసం భారీ ఒప్పందాలు చేసుకుంది. కానీ ఇటీవల వాణీ కపూర్ కి ఆశించిన విజయాలేవీ దక్కలేదు.
తాజా సమాచారం మేరకు.. పాకిస్తానీ సూపర్ స్టార్ ఫవాద్ ఖాన్ సరసన వాణీ కపూర్ నటిస్తోంది. రొమాంటిక్ కామెడీ `అబిర్ గులాల్` తన కెరీర్ లో గేమ్ ఛేంజర్ అవుతుందని వాణీ భావిస్తోంది. క్రాస్ కల్చర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందుతోంది. `అబిర్ గులాల్` 2025 చివరిలో విడుదల కానుందని సమాచారం. ఇటీవలే లండన్ లోని పలు లొకేషన్లలో కీలక షెడ్యల్ ని ముగించారు. `చల్తీ రహే జిందగీ` ఫేం ఆర్తి ఎస్. బగ్దీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ స్టోరీస్, ఎ రిచర్ లెన్స్ - అర్జయ్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇటీవల లండన్‌లో 40 రోజుల షూటింగ్ షెడ్యూల్‌ను ముగించారని సమాచారం. ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని, మొదటి దశగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించాలనే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది.
ఫవాద్ ఏ దిల్ హై ముష్కిల్, కపూర్ & సన్స్ సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో తన పాత్రలకు గొప్ప ప్రశంసలు పొందాడు. అబిర్ గులాల్ చిత్రంలో UK ఆధారిత చెఫ్ పాత్రలో ఫవాద్ ఖాన్‌ను చూపించారని తెలిసింది. ఈ చిత్రంలో వాణితో పాటు లీసా హెడెన్ కూడా నటిస్తోంది.
సినిమాలతో పాటు వాణీకపూర్ సోషల్ మీడియాల్లోను నిరంతరం అభిమానులకు టచ్ లో ఉంది. ఈ భామ లేటెస్ట్ బోల్డ్ ఫోటోషూట్లు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. తాజాగా మరో డస్కీ ఫోటోషూట్ తో యువతరం గుండెల్లో గుబులు రేపుతోంది. వాణీ కపూర్ రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.