నడుము అందాలతో హీట్ పెంచేస్తోన్న గాయత్రి
టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ గాయత్రి భరద్వాజ్.
టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ గాయత్రి భరద్వాజ్. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఈ బ్యూటీ తరువాత నటిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సినిమాల కంటే వెబ్ సిరీస్ లలోనే ఎక్కువగా నటించింది. పటోల అనే వెబ్ సిరీస్ తో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు ఆరు వెబ్ సిరీస్ లలో నటించింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతోనే గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాల్సింది. ఈమెతో కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు కూడా. ఎందుకనో తరువాత గాయంత్రిని తప్పించి ఆమె స్థానంలో కేతిక శర్మని తీసుకున్నారు. మరల తెలుగులో డెబ్యూ కోసం ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది.
టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో మంచి గ్లామర్ టచ్ తో పాటుగా నటనకి స్కోప్ ఉన్న పాత్రలోనే గాయత్రి నటించింది. అయితే మూవీ ఫ్లాప్ టాక్ రావడంతో గాయత్రి ఆశలు నీరుగారిపోయాయి. అయితే తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎట్రాక్ట్ చేసే ప్రయత్నంలో గాయత్రి భరద్వాజ్ ఉంది. గ్లామర్ క్వీన్ గా తనని తాని రిప్రజెంట్ చేసుకుంటే దర్శక నిర్మాతల దృష్టిలో పడొచ్చని భావిస్తోంది.
అందుకే డోస్ పెంచి గ్లామర్ ఫోటోషూట్ లతో ఇన్ స్టాగ్రామ్ లో సందడి చేస్తోంది. టైగర్ నాగేశ్వరరావు మూవీ రిలీజ్ సందర్భంగా కూడా ఆమె హాట్ హాట్ కాస్ట్యూమ్స్ తో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్ లో నడుము అందాలు చూపిస్తూ వయ్యారంగా నిలబడి తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో అప్సరసలా గాయత్రి తన అందాలతో మెరిసిపోతోంది.
ఈ ఫోటోలో చూపులతోనే వలపుల బాణాలు విసురుతూ కుర్రాళ్ళ మనసుకి గాయం చేస్తోంది. ఈ స్థాయిలో గ్లామర్ డోస్ తో ఫోటోషూట్ లు చేస్తుంటే కచ్చితంగా టాలీవుడ్ లో అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. కరెక్ట్ సినిమా పడితే తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఈ బ్యూటీ దగ్గర ఉన్నాయని నెటిజన్లు నుంచి కామెంట్స్ వస్తున్నాయి.