క్యూట్ సమంత.. పొద్దున్నే ఇలా కవ్విస్తే ఎలా?

సమంతను హ్యాపీ ఫేస్ లో చూసి ఫ్యాన్స్ కూడా ఆనందిస్తున్నారు.

Update: 2023-07-20 05:52 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె ఇప్పటి వరకు దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా కొనసాగారు. ఇప్పుడు వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతున్నారు. చివరగా, సామ్ శాకుంతలం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్న ఆమె ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ పూర్తయ్యింది. మరోవైపు సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది.




 


తన చేతిలో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు మొత్తం పూర్తి చేసుకున్న ఆమె ప్రస్తుతం తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టింది. షూటింగ్స్ కి కంప్లీట్ గా బ్రేక్ ఇచ్చింది. త్వరలోనే అమెరికా వెళ్లి చికిత్స తీసుకోనుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఫోటో షేర్ చేశారు. దాంట్లో ఆమె తన కుక్క పిల్లను హాయిగా హత్తుకొని పడుకున్నట్లుగా ఉంది. అందులో ఆమె ఫేస్ చాలా హ్యాపీగా కనపడుతోంది. గుడ్ మార్నింగ్ అంటూ క్యాప్సన్ కూడా పెట్టారు. సమంతను హ్యాపీ ఫేస్ లో చూసి ఫ్యాన్స్ కూడా ఆనందిస్తున్నారు.

కాగా, సమంత ప్రస్తుతం ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. చైతూతో విడాకులు తీసుకున్న సమయంలోనూ ఆమె చాలా ఆలయాలు చుట్టివచ్చారు. ఇప్పుడు మళ్లీ దేవాలయాలకు వెళ్లి వచ్చారు. నిన్నటి కి నిన్న కోయంబత్తూర్‌లో ఈషా ఫౌండేషన్‌లో ఆమె పాల్గొన్నారు. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలో ఆశ్రమంలో అనేక మందితో కలిసి ధ్యానంలో పాల్గొన్నారు.

అనంతరం, ధ్యానానికి ఇంత శక్తి ఉన్నట్టు తాను ముందు ఊహించలేకపోయానంటూ ఇన్‌స్టాలో తన అనుభూతిని పంచుకున్నారు. ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలౌతున్నారు. ధ్యానం చేయడం వల్ల ఆమె మనసుకు ప్రశాంతత లభించిందని, అందుకే ఆమె ముఖంలో అంత సంతోషంగా కనపడుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం.

ఇదిలా ఉండగా, సమంత నటించిన ఖుషీ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ ఖుషీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఖుషీ మూవీ రాబోతోంది. ఖుషీ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతతోపాటు జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

Tags:    

Similar News