తెలుగమ్మాయి స్కిన్ టోన్ పై ఇదేం చర్చ?
తెలుగమ్మాయి శ్రేయాధన్వంతరి బాలీవుడ్ లో చక్రం తిప్పుతోన్న సంగతి తెలిసింది.
తెలుగమ్మాయి శ్రేయాధన్వంతరి బాలీవుడ్ లో చక్రం తిప్పుతోన్న సంగతి తెలిసింది. హైదరాబాద్ నుంచి వెళ్లి ముంబైలో మకాం వేసి బిజీ అయిన నటి. అమ్మడి ప్లానింగ్ తొలి నుంచి రొటీన్ కిభిన్నంగా ఉంది. తనలో ఆ రేర్ క్వాలిటీనే మిగతా భామల నుంచి వేరు చేసింది. బాలీవుడ్ లో బిజీ అవ్వడనికి కారణమైంది. మ్యాడ్ మేన్ సిరీస్ లో నటించిన సొగసరి కొన్నాళ్ల పాటు వెనక్కి తిరిగి చూడకుండా వెబ్ సిరీస్ లతో బిజీ అయింది.
అక్కడ నుంచి బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో పెద్ద తెరకు ప్రమోట్ అయింది. ప్రస్తుతం కెరీర్ లో మరింత బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. మంచి అవకాశాలు ఒడిసిపట్టుకుంటుంది. ఇదే సమయంలో కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు చేస్తుంది. ప్రస్తుతం శ్రేయా ముంబై డైరీస్ రిలీజ్ సందర్భంగా ప్రచారంలో బిజీగా ఉంది. ఇక చేతిలో సమయం చిక్కినప్పుడు ఇన్ స్టాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా సొగసరి న్యూ సిరీస్ ఫోటోలు ఇన్ స్టాలో దర్శనమిస్తున్నాయి.
ఇదిగో ఇక్కడిలా క్రీమ్ కలర్ డిజైనర్ లో వావ్ అనిపించే భంగిమలో ఆకట్టుకుటుంది. అమ్మడి పాలనురుగల సౌందర్యం మిరుమిట్లు గొలుపుతుంది. ముస్తాబైన విధానం..హెయిర్ స్టైల్ ప్రతీది శ్రేయాలో బ్యూటీని హైలైట్ చేస్తున్నాయి. అమ్మడి స్కిన్ టోన్ ని ప్రత్యేకంగా ఇష్టపడే అభిమానులు కూడా ఉన్నారని ఇప్పుడే తెలుస్తోంది. శ్రేయా రంగుపై ఆసక్తికర కామెంట్లే అందుకు సాక్ష్యం. ప్రస్తుతం ఈఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
హైదరాబాద్ చెందిన శ్రేయాధన్వంతరి ఢిల్లీ పెరిగింది. వరంగల్ నీట్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది.శ్రేయాకి తొలి నుంచి సినిమాలంటే ఆసక్తి. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ మొదలు పెట్టింది. ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో రన్నరప్ గా నిలిచింది. అటుపై సినిమాల్లోకి అడుగుపెట్టింది. `జోష్` చిత్రం నాగచైతన్యకే కాదు శ్రేయకి డెబ్యూనే.