విన్నంతనే చిత్రంగా.. అంతకు మించి విచిత్రంగా ఉండటందీని సొంతం. జలకన్య అన్నంతనే ఇదేదో సినిమా పేరు కానీ.. లేదంటే సీరియల్ పేరు కానీ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఇంత అందమైన పేరు పెట్టుకుంది మరి దేనికో కాదు.. ఒక మొక్కకు. దీనికున్న కొన్ని ప్రత్యేకతలే దీన్ని మిగిలిన వాటికి భిన్నంగా నిలిపాయని చెప్పాలి. భారతీయ సైంటిస్టులు తాజాగా ఈ మొక్కను కనుక్కున్నారు. అండమాన్ దీవుల్లో ఉన్న అర్చిపెలగో దీవిలో కొనుగొంటున్న ఈ కొత్త మొక్క పేరుకు.. ఊహించిన దాని కంటే చాలా అందంగా ఉంటుంది. ఇంతకీ ఆ పేరేమిటో తెలుసా? ‘‘జలకన్య’’. అందేంటని తెల్లముఖం వేశారు.. ఇదేం పేరని? ఇంతకీ దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఈ మొక్కను కనుగొన్నది ఎవరు? అన్న వివరాల్లోకి వెళితే..
భారతీయ శాస్త్రవేత్తలు తాజాగా ఒక రకం మొక్కను కనుగొన్నారు. అండమాన్ దీవుల్లో ఉన్న అర్చిపెడాగో దీవీలో ఈ కొత్త మొక్కను కనుగొన్నారు. దీనికి వృక్ష శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఇంగ్లిషులో మెరమైడ్ అయితే.. తెలుగులో జలకన్యగా డిసైడ్ చేశారు. ఈ మొక్కను కనుగొని రెండేళ్లు అయినా.. ఇది కొత్త రకం మొక్క అని చెప్పటానికి మాత్రం కాస్త ఎక్కువ సమయమే పట్టింది. దీనికి కారణం..తాజాగా కనుగొన్న మొక్క గతంలో లేదన్న విషయాన్ని అన్ని విధాలుగా పరీక్షలు జరిపి డిసైడ్ చేశారు.
అండమాన్ లోని అర్చిపెలాగో దీవిలో వృక్ష శాస్త్రవేత్తలు 2019లో పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తజాతిని గుర్తించారు. గడిచిన నాలుగు దశాబ్దాల్లోకి వచ్చిన మొక్కలకు పూర్తి భిన్నమని తేల్చారు. ఈ మొక్క డీఎన్ ఏను చూసిన శాస్త్రవేత్తలు సదరు మొక్కకు శాస్త్రీయ నామం ‘‘అసిటబులేరియా’’ అని పెట్టారు. జల కన్య అంటే సాగర దేవత అన్నది అర్థమని చెబుతున్నారు.
తక్కువ మందంగా ఉండి.. సున్నితంగా ఉండే దీనికి ఆకులు.. గొడుగుల మాదిరి ఉండటం విశేషం. ఈ మొక్క ఒక్క భారీ కణంతో తయారైనట్లు చెబుతున్నారు. అందుకే ఆ పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రపంచానికి కొత్త తరహా మొక్కను భారతీయశాస్త్రవేత్తలు పరిచయం చేశారని చెప్పాలి.