కరోనా వైరస్ వ్యాప్తి అంచనా వేసేందుకు ఈ ఏడాది మే ప్రారంభంలో ICMR దేశవ్యాప్త సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా రూపొందించిన పరిశోధన పత్రాన్ని ఈ నెల ప్రచురించగా , ఆ సర్వేలో 10 నగరాలకు సంబంధించిన కంటైన్ మెంట్ డేటా లేకుండా పోయింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ ఆదేశాల మేరకే ఈ డేటాను పేపర్ నుంచి తొలగించినట్లుగా పరిశోధకులు చెప్పారు. అయితే, ఈ డేటాను పేపర్ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందని, ఆ లెక్కలను ఎందుకు బయటపెట్టలేదు అనేదానిపై పెద్ద చర్చ జరుగుతుంది.
దీనిపై ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ మాట్లాడుతూ... శాంపిల్స్ సైజు తక్కువగా ఉండటం వల్ల మొదటి జాతీయ సెరో సర్వే అధ్యయన పత్రంలో ఆ డేటా చేర్చబడలేదని, అలాగే ఆ 10 నగరాల్లోని కంటైన్ మెంట్ జోన్లు,హాట్ స్పాట్లలో రోజు రోజుకు,వార వారానికి లెక్కలు మారిపోతున్నాయన్నారు. ఏదో కొద్దిపాటి శాంపిల్స్ తో సర్వే చేసి దాని ఆధారంగా అంచనా వేసే డేటాను అధ్యయన పత్రంలో చేర్చడం కుదరని పని అన్నారు. అందుకే తదుపరి చర్యల కోసం గత సెరో సర్వే ఆధారంగా అంచనా వేసిన డేటానే ఆయా రాష్ట్రాలకు పంపించినట్లు వెల్లడించారు. అయితే , ఆ 10 నగరాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలోనే ఆ వివరాలని ప్రచురించలేదు అని మరో వాదన వినిపిస్తుంది.
ఐసీఎంఆర్ ప్రచురించని ఆ డేటాలో హాట్ స్పాట్స్ గా ఉన్న నగరాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పొందుపరిచింది. ముంబైలోని 36శాతం,అహ్మదాబాద్ లో 48శాతం,కోల్ కతాలో 30శాతం మేర వైరస్ సంక్రమణ ఉన్నట్లు తెలిపింది. కేవలం వైరస్ సంక్రమణ తక్కువగా ఉన్న జిల్లాల డేటాను మాత్రమే ఇందులో ప్రచురించినట్లు వెల్లడించింది. మరోవైపు ఈ 10 నగరాలకు సంబంధించిన డేటాను వెల్లడించకపోవడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా మొత్తం 70 జిల్లాల్లో 400 మంది చొప్పున శాంపిల్స్ ను ఈ సర్వే కోసం సేకరించారు. అహ్మదాబాద్, భోపాల్, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, ఇండోర్, జైపూర్, పుణే, సూరత్ నగరాల నుంచి 500 చొప్పున శాంపిల్స్ సేకరించారు. అయితే జిల్లాల లెక్కలను బయటపెట్టి,హాట్ స్పాట్ల డేటాను మాత్రం గోప్యంగా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.