తెలుగు రాజకీయాలకు 10ఇయర్స్ ఛాలెంజ్ ను అన్వయిస్తే కచ్చితంగా కేసీఆర్ - చంద్రబాబు గురించి మాట్లాడుకోవాల్సిందే. సరిగ్గా పదేళ్ల కిందట మిత్రులుగా ఉన్న ఈ ఇద్దరు - ఈ పదేళ్లలో శత్రువులుగా మారారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో 10 ఇయర్స్ ఛాలెంజ్ స్టార్ట్ అయిన టైమ్ కు వీళ్లిద్దరి మధ్య రాజకీయ శత్రుత్వం పీక్ స్టేజ్ కు చేరింది.
పదేళ్ల కిందట టీఆర్ ఎస్ - టీడీపీ మిత్ర పక్షాలు. అప్పుడు వీళ్లిద్దరి కామన్ ఎజెండా వైఎస్ ఆర్. కేవలం వైఎస్ ఆర్ ను ఓడించడం కోసమే టీఆర్ ఎస్ - టీడీపీ కలిశారు. ఐదేళ్ల కిందట రాష్ట్ర విభజన టైమ్ లోఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. అప్పట్నుంచి చంద్రబాబును కేసీఆర్ విమర్శిస్తూనే ఉన్నారు. బాబు కూడా కేసీఆర్ పై గుస్సా అవుతూనే ఉన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కేసీఆర్ - బాబు మధ్య వైరం పతాక స్థాయికి చేరింది. ఫెడరల్ ఫ్రంట్ స్థాపించి అందులోకి వైసీపీని ఆహ్వానించిన కేసీఆర్ - బాబును అస్సలు పట్టించుకోలేదు. ఇదే ఇప్పుడు చంద్రబాబు ఆగ్రహానికి కారణమైంది. దీనికి తోడు ఏపీ రాజకీయాల్లో కలుగజేసుకుంటామని - రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తామంటూ కేసీఆర్ ప్రకటించడంతోచంద్రబాబు భగ్గుమంటున్నారు.