డిసెంబరు 31 రాత్రి ఎన్ని గంటలకు మంత్రి కేటీఆర్ నిద్ర పోయారో కానీ.. జనవరి ఒకటో తేదీన పొద్దుపొద్దున్నే తాను యాక్టివ్ గా ఉన్న విషయాన్ని తన ట్వీట్ తో చెప్పకనే చెప్పేశారు మంత్రి కేటీఆర్. డిసెంబరు 31 హ్యాంగవుట్ నుంచి బయటకు రాలేక.. బద్ధకంగా కదులుతున్న హైదరాబాద్ మహానగరంలో.. మిగిలిన వారికి భిన్నంగా కేటీఆర్ యాక్టివ్ గా ఉన్నారన్న విషయం ఆయన పోస్ట్ చేసిన తాజా ట్వీట్ తో అర్థమైపోయింది.
కొత్త సంవత్సరం కొంగొత్తగా కేటీఆర్ ను అవాక్కు అయ్యేలా చేసిందో ఉదంతం. రాకేష్ అనే వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేస్తూ.. ఈ రోజు ఉదయం కొంతమంది కుర్రాళ్లు యాక్సిడెంట్ కు గురయ్యారు. దాన్ని చూసి మేం 108కి ఫోన్ చేస్తే.. మీరు ఏపీ కాల్ సెంటర్ కు ఫోన్ చేశారని చెప్పారని.. అదే పనిగా పలుమార్లు కాల్ చేసిన తర్వాత తెలంగాణ కాల్ సెంటర్ కు కనెక్ట్ అయ్యిందని.. ఈ ఇష్యూను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరిస్తే మరింత త్వరగా మెడికల్ సాయం అందుతుందని కోరారు.
దీనికి స్పందించిన కేటీఆర్.. ఇలాంటి ఉదంతాన్ని తాను మొదటిసారి వింటున్నానని.. వెంటనే ఈ ఇష్యూ మీద దృష్టి పెడతానని వెల్లడించారు. కొత్త సంవత్సరం వేళ.. అభినందనల హడావుడిలోనూ.. తన దృష్టికి వచ్చిన ఉదంతంపై వెంటనే స్పందించిన వైనం చూసినప్పుడు కేటీఆర్ ను అభినందించకుండా ఉండలేం. కీపిటప్ కేటీఆర్.